మహేంద్ర సింగ్ ధోనీ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వకముందు టీమ్ఇండియాకు పార్థివ్ పటేల్ వికెట్‌కీపర్‌గా ఉండేవాడు. అయితే అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో ఇతడు విఫలమయ్యాడు. 2005లో జట్టులోకి వచ్చిన మహీ.. కెరీర్ ప్రారంభంలో సూపర్హిట్టర్గా పేరు తెచ్చుకోవడం సహా కీపర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్నాడు. దీంతో పార్థివ్, దినేశ్ కార్తిక్ లాంటి వారు ఎంపికైనా సరే రెండో కీపర్‌గా ఉండాల్సిన పరిస్థితి. అయితే అప్పటి పరిస్థితుల గురించి ఇటీవలే మాట్లాడిన పార్థివ్.. ధోనీ రాకతో తమకు అవకాశం లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు.
"టీమ్ఇండియాలో అప్పటి పరిస్థితుల్ని ఒప్పుకుని, అంగీకరించాల్సిన పరిస్థితి. ధోనీ కెప్టెన్‌గా ఉండటం వల్ల మిగిలిన కీపర్లు, రెండో వికెట్ కీపర్ స్థానం కోసమే పోటీపడాల్సి వచ్చింది. దీంతో మాకు కీపింగ్ చేసే అవకాశం లేకుండా పోయింది" -పార్థివ్ పటేల్, సీనియర్ క్రికెటర్
2002లో అరంగేట్రం చేసిన పార్థివ్.. ఇప్పటివరకు 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. 2018లో చివరగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో పాల్గొన్నాడు. ఇటీవలే కాలంలో పంత్, సాహా రాణిస్తుండటం వల్ల అతడికి ఛాన్స్ రావడం కష్టమైంది.
ఇది చదవండి: 'ధోనీ అందుకే సామాజిక మాధ్యమాల్లోకి రావట్లేదు'