ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అద్భుతం సృష్టించాడు. సారథిగా ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్సులు కొట్టిన వాడిగా ఘనత సాధించాడు. ఇప్పటివరకు ధోనీ(211) పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించాడు. మోర్గాన్ కేవలం 163 మ్యాచ్‌ల్లోనే దీనిని అందుకోగా, మహీకి మాత్రం 332 మ్యాచ్‌లు పట్టింది.
త్వరాతి స్థానాల్లో రికీ పాంటింగ్ (324 మ్యాచ్‌లలో 171 సిక్సర్లు), బ్రెండన్ మెకల్లమ్ (121 మ్యాచ్‌లలో 170 సిక్సర్లు ) ఏబి డివిలియర్స్ (124 మ్యాచ్‌ల్లో 135 సిక్సర్లు) ఉన్నారు.

ఐర్లాండ్‌తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో కెప్టెన్ మోర్గాన్(106) సెంచరీతో కదం తొక్కాడు. ఇందులో 15 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. తద్వారా 50 ఓవర్లలో 328 పరుగులు చేసిందీ జట్టు.
అనంతరం ఛేదనలో ఐర్లాండ్ జట్టు లక్ష్యాన్ని 49.5 ఓవర్లలో పూర్తి చేసింది. అద్భుత ప్రదర్శన చేసిన బ్యాట్స్‌మెన్ పాల్ స్టిర్లింగ్(142)- ఆండ్రూ బల్బిర్నీ(113).. తమ జట్టును గెలిపించారు. ఇప్పటికే 2-1 తేడాతో ఇంగ్లీష్ జట్టు సిరీస్ గెలుచుకుంది.
