ETV Bharat / sports

ఓపెనింగ్ ఇవ్వకపోతే ఫినిషర్​గా అదరగొడతా: రహానె - ipl news 2020

ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు తొలిసారి ఆడనున్న రహానె.. జట్టులో తన స్థానం గురించి మాట్లాడాడు. కోచ్​ పాంటింగ్​తో కలిసి పనిచేసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.

ఓపెనింగ్ లేకపోతే ఫినిషర్​గా అదరగొడతా: రహానె
అజింక్య రహానె
author img

By

Published : Aug 27, 2020, 4:05 PM IST

తను ఓపెనింగ్ బ్యాటింగ్​ను ఆస్వాదిస్తానని, ఒకవేళ కుదరనప్పుడు ఫినిషర్​గానూ మ్యాచ్​ను ముగిస్తానని క్రికెటర్ అజింక్య రహానె అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు తొలిసారి ఆడనున్న ఇతడు.. జట్టులో తన స్థానంతో పాటు శిక్షణ, బ్యాటింగ్ తదితర విషయాల గురించి మాట్లాడాడు. టీ20ల్లో 5000ల మార్క్​ను అందుకునేందుకు మరో 12 పరుగుల దూరంలో ఉన్నాడు రహానె.

"జట్టులో(దిల్లీ క్యాపిటల్స్​) ఏ స్థానం ఇస్తారో ఇంకా తెలియదు. ప్రాక్టీసు సెషన్స్ ప్రారంభమై, వాళ్లతో మాట్లాడితేనే తెలుస్తుంది. కెరీర్​ మొత్తం ఓపెనింగ్ చేస్తూ, దానిని ఆస్వాదించాను. కానీ ఈ ఐపీఎల్​లో మాత్రం మేనేజ్​మెంట్ తీసుకునే నిర్ణయంపై నా బ్యాటింగ్ స్థానం ఆధారపడి ఉంటుంది. వాళ్లు ఏం చేయమన్నా సరే 100 శాతం నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నాను"

-అజింక్య రహానె, బ్యాట్స్​మన్

దిల్లీ జట్టులో ప్రస్తుతం శిఖర్ ధావన్, పృథ్వీషా, శ్రేయస్ అయ్యర్, హెట్మయిర్, పంత్ వరుస స్థానాల్లో ఉన్నారు. దీంతో రహానె చివర్లోనే రావాల్సి ఉంటుంది.

టీ20ల్లో ఫినిషర్​గా రహానె సక్సెస్​ అవుతాడా? అన్న ప్రశ్నకు కూడా సమాధానమిచ్చాడు ఈ బ్యాట్స్​మన్.

"5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ చేయమని చెప్పినా నేను సిద్ధంగానే ఉన్నాను. నా ఆటను సరికొత్తగా ఆవిష్కరించేందుకు అది సహాయపడుతుంది. ఒకవేళ దీని గురించి ఎవరు అడిగినా నా సమాధానం 'అవును' అనే వస్తుంది. కాకపోతే ఐదు నుంచి ఆరు వారాల నెట్ సెషన్స్​తో పాటు మేనేజ్​మెంట్​తో చర్చిస్తే సరిపోతుంది"

-అజింక్య రహానె, బ్యాట్స్​మన్

దిల్లీ జట్టు కోచ్ రికీ పాంటింగ్​ ఆధ్వర్యంలో చాలా విషయాలు నేర్చుకోవచ్చని అన్నాడు రహానె. దానికోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. తన ఆటను మరో స్థాయికి పెంచేందుకు ఇదే సరైన సమయమని చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.