ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు . టెస్టు క్రికెట్​లో 600 వికెట్లు సాధించిన తొలి బౌలర్​గా రికార్డులకెక్కాడు.

author img

By

Published : Aug 25, 2020, 9:36 PM IST

Updated : Aug 25, 2020, 9:58 PM IST

ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ రికార్డు
ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ రికార్డు

ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఏ ఫాస్ట్ బౌలర్​కు సాధ్యం కాని ఘనతను సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో 600 వికెట్లు దక్కించుకున్న తొలి పేసర్​గా రికార్డులకెక్కాడు. ఇతడి దరిదాపుల్లో కూడా ఏ ఫాస్ట్ బౌలర్ లేకపోవడం గమనార్హం.

ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ రికార్డు
ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ రికార్డు

మొత్తంగా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు అండర్సన్. స్పిన్నర్లు ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ రికార్డు
600 వికెట్లు సాధించిన బౌలర్లు

600 వికెట్లలో భారత బ్యాట్స్​మెన్​నే ఎక్కువసార్లు ఔట్ చేశాడు అండర్సన్. ఇందులో టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్​వి 110 వికెట్లు ఉన్నాయి. తర్వాత ఆస్ట్రేలియాపై 104 వికెట్లు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికాపై 83, వెస్టిండీస్​పై 87 వికెట్లు సాధించాడు. అలాగే సొంతగడ్డపై 384 వికెట్లను తీశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 50కి పైగా వికెట్లు పడగొట్టాడు.

టెస్టుల్లో 500కు మించి వికెట్లు సాధించిన వారిలో గ్లేన్ మెక్​గ్రాత్ (563), వాల్ష్ (519), స్టువర్ట్ బ్రాడ్ (511) ఉన్నారు. ఇందులో బ్రాడ్ మాత్రమే ఇంకా క్రికెట్​లో కొనసాగుతున్నాడు.

Last Updated : Aug 25, 2020, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.