శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. సిరీస్‌ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది. చివరి టెస్టును మరో రోజు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో గెలుచుకుంది.
ఆతిథ్య జట్టు నిర్ణయించిన 164 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రూట్ సేన చేధించింది. ఓ దశలో 89 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న జట్టును.. జోస్ బట్లర్(46), డామ్ సిబ్లీ(56) ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు అవసరమైన 75 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఆరు పరుగులే చేసిన సిబ్లీ.. అవసరమైన సమయంలో కీలకమైన అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న లంక జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 35.5 ఓవర్లు ఆడి 126 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్లు డామ్ బెస్, జాక్ లీచ్‌లు చెరో నాలుగు వికెట్లతో రాణించారు.
426 పరుగులతో సిరీస్‌లో నిలకడగా రాణించిన జో రూట్‌ను.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌లు వరించాయి.
2018లో రూట్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు 3 టెస్టుల సిరీస్‌ను గెలువగా.. తాజాగా మరో రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. శ్రీలంకలో వరుసగా ఐదు టెస్టులు గెలిచిన రికార్డు ఉన్న కోహ్లి సరసన రూట్ నిలిచాడు.
ఇంగ్లాండ్ తన తదుపరి సిరీస్ కోసం భారత్‌లో పర్యటించనుంది.
ఇదీ చదవండి: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ వాయిదా