ETV Bharat / sports

ఇంగ్లాండ్​ రికార్డు.. 107 ఏళ్ల తర్వాత తొలిసారి - England win 5 consecutive Tests abroad

శ్రీలంకపై టెస్టుసిరీస్​ విజయంతో ఇంగ్లాండ్​ జ్టటు మరో రికార్డు సృష్టించింది. విదేశీ గడ్డపై 107 ఏళ్ల తర్వాత తొలిసారి వరుసగా ఐదు టెస్టులు గెలిచిన ఘనతను అందుకుంది.

england
ఇంగ్లాండ్​
author img

By

Published : Jan 26, 2021, 9:48 AM IST

సుదీర్ఘ ఫార్మాట్​లో ఇంగ్లాండ్​ జట్టు విజయాల పరంపరతో దూసుకెళ్తోంది. విదేశీ గడ్డపై వరుసగా ఐదు టెస్టులు గెలిచి రికార్డు సృష్టించింది పర్యటక జట్టు. 107 ఏళ్ల తర్వాత విదేశాల్లో వరుసగా 5 టెస్టులు గెలవడం ఇదే తొలిసారి. 2020లో దక్షిణాఫ్రికాపై మూడు టెస్టులు గెలిచిన ఇంగ్లీష్​ జట్టు.. తాజాగా శ్రీలంకపై రెండు టెస్టులను గెలిచి ఈ ఘనత సాధించింది. చివరిసారిగా 1911-1914 మధ్య దక్షిణాఫ్రికా(3), ఆస్ట్రేలియా(4)పై వరుసగా 7 టెస్టులు గెలిచిన రికార్డు ఇంగ్లాండ్​కు ఉంది.

సోమవారం ముగిసిన రెండో టెస్టులో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్​ జట్టు.. సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని ప్రత్యర్థి జట్టును వైట్​వాష్​ చేసింది. భారత్​తో సిరీస్​ కోసం ఈ నెల 27న రానుంది ఇంగ్లీష్​ జట్టు. ఈ పర్యటనలో ఇరు జట్లు నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి. తొలుత ఫిబ్రవరి 5న జరిగే టెస్టుతో సిరీస్​ ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, మూడోదైన డేనైట్ టెస్టుతో పాటు నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. తర్వాత టీ20 పోరు కోసం సిద్ధమవనున్నాయి ఇరుజట్లు. 28న జరిగే వన్డేతో ఇంగ్లాండ్ పర్యటన పూర్తి కానుంది.

ఇదీ చూడండి: 27న భారత్​కు ఇంగ్లాండ్​ జట్టు.. నేరుగా క్వారంటైన్​కు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.