ETV Bharat / sports

'భారత్​తో వరుస ఓటములపై మాకు భయం లేదు' - England will not panic

ప్రస్తుత సిరీస్​ ఓటములతో ఇంగ్లాండ్​ భయపడదని తేల్చి చెప్పాడు ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ జోస్ బట్లర్. అత్యుత్తమ క్రికెట్​ ఆడామని పేర్కొన్నాడు. పొట్టి ప్రపంచకప్​ నేపథ్యంలో ఇక్కడి పిచ్​లపై అవగాహన వచ్చిందని వెల్లడించాడు.

England will not panic despite India tour defeats: Jos Buttler
'భారత్​పై ఓడిపోయినప్పటికీ ఇంగ్లాండ్ భయపడదు'
author img

By

Published : Mar 29, 2021, 6:39 PM IST

భారత్​పై వరుసగా మూడు సిరీస్​లు కోల్పోయినప్పటికీ.. తమ టీమ్​​ భయపడదని ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ జోస్ బట్లర్​ తెలిపాడు. ఈ పరాభవం వేరే జట్లకు ఎదురైతే ఆ టీమ్​లలో చాలా మార్పులు జరగేవని పేర్కొన్నాడు. కానీ ఇంగ్లాండ్​కు అలా కాదని వెల్లడించాడు.

"ప్రస్తుత సిరీస్​ ఓటముల గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. చాలా కాలంగా మేము మెరుగైన క్రికెట్​ను ఆడుతున్నాం. మంచి స్థితిలో ఉన్నాం" అని బట్లర్ పేర్కొన్నాడు.

"ఈ సిరీస్​ ద్వారా కొంతమంది కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. రానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత పిచ్​లపై మాకు అవగాహన వచ్చింది. 2021 పొట్టి వరల్డ్​కప్​తో పాటు 2023 ప్రపంచకప్​ భారత్​లోనే జరగనున్నాయి. సామ్​ కరన్, లివింగ్​స్టోన్ వంటి అద్భుత క్రికెటర్లు ఇక్కడి వికెట్​పై రాణించడం జట్టుకు శుభపరిణామం" అని బట్లర్ తెలిపాడు.

కరన్​పై ప్రశంసలు..

మూడో వన్దేలో చివరి వరకు నిలిచి ఇంగ్లాండ్​ విజయం కోసం ప్రయత్నించిన సామ్ కరన్​పై బట్లర్ ప్రశంసలు కురిపించాడు. ఈ యువ క్రికెటర్​ పోరాట స్ఫూర్తిని చూసి జట్టు సభ్యులు నేర్చుకోవాలన్నాడు.

ఇదీ చదవండి: 'పంత్​ లేని జట్టును ఊహించగలమా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.