సౌథాంప్టన్‌లో జరుగుతున్న ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య రెండో టెస్టును వరుణుడు వదలట్లేదు. వర్షం కారణంగా ఆదివారం, నాలుగో రోజు ఆటలో కేవలం 10.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. తొలి సెషన్‌లో బ్యాటింగ్ కొనసాగించిన పాకిస్థాన్.. మరో 13 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైంది. రిజ్వాన్ 72 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. బ్రాడ్ (4/56) నాలుగు వికెట్లతో రాణించాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్.. వర్షం కారణంగా ఆట ఆగిపోయే సమయానికి 7/1తో నిలిచింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కేవలం ఐదు ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆ తర్వాత వర్షం కారణంగా తిరిగి క్రికెటర్లు మైదానంలోకి రాలేదు. వాన వల్ల ఇప్పటికే మూడో రోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.