మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 383 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయి 197 పరుగులకే ఆలౌటైంది. కమిన్స్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
-
England fought hard, but Australia were just too good.
— ICC (@ICC) September 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A superb, dramatic final day ends with the tourists having won by 185 runs.#Ashes scorecard 👇https://t.co/zrb0K55IBc pic.twitter.com/ZH45ItuUxm
">England fought hard, but Australia were just too good.
— ICC (@ICC) September 8, 2019
A superb, dramatic final day ends with the tourists having won by 185 runs.#Ashes scorecard 👇https://t.co/zrb0K55IBc pic.twitter.com/ZH45ItuUxmEngland fought hard, but Australia were just too good.
— ICC (@ICC) September 8, 2019
A superb, dramatic final day ends with the tourists having won by 185 runs.#Ashes scorecard 👇https://t.co/zrb0K55IBc pic.twitter.com/ZH45ItuUxm
రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... ఐదో రోజు ఆటలోనూ జోరు చూపించలేకపోయింది. ఆసీస్ పేసర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఇబ్బందిపడ్డారు. ఇంగ్లీష్ ఆటగాళ్లలో జో డెన్లీ ఒక్కడే అర్ధశతకంతో ఫర్వాలేదనిపించాడు. సారథి రూట్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రోరీ బర్న్స్ (0), రాయ్ (31), స్టోక్స్ (1), బెయిర్ స్టో (25), బట్లర్ (34) విఫలమయ్యారు. కంగారూల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు 197 పరుగులకే ఆలౌటైంది ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు. ఫలితంగా ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (211), రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులతో ఆసీస్ గెలుపులో కీలకపాత్ర పోషించిన స్మిత్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది.
ఈ విజయంతో యాషెస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది ఆస్ట్రేలియా. చివరి టెస్టు ఓవల్ వేదికగా సెప్టెంబర్ 12న ప్రారంభంకానుంది.
ఇవీ చూడండి..