యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్టు.. హెడింగ్లీ వేదికగా గురువారం ప్రారంభం కానుంది. ఇందుకోసం 12 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్. అండర్సన్ ఇంకా గాయంతో బాధపడుతున్న కారణంగా అతడికి అవకాశం దక్కలేదు.
ఎడ్బాస్టన్ వేదికగా జరిగిన మెుదటి మ్యాచ్‌లో అండర్సన్ గాయపడ్డాడు. కండరాల పట్టేయడం వల్ల ఆటనుంచి తప్పుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా 251 పరుగుల తేడాతో గెలిచింది.
లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో అండర్సన్ కొనసాగే పరిస్థితి లేకపోవడం వల్ల ఆ స్థానంలో పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడీ బౌలర్. ఇది డ్రాగా ముగిసింది. అయితే ఈ టెస్టులో అవకాశం దక్కని లెఫ్ట్ ఆర్మ్ ఆటగాడు శామ్ కరన్ మూడో టెస్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇదీ చూడండి: ట్రైలర్: తండ్రి ఆనందం కోసం కూతురి పోరాటం