ETV Bharat / sports

'ఓపికతో బౌలింగ్​ చేస్తే వికెట్లు అవే వస్తాయి' - sports latest news

భారత పర్యటన కోసం వచ్చే ఇంగ్లాండ్​ టీమ్​కు పలు సూచనలు చేశాడు ఆ దేశ మాజీ స్పిన్నర్​ గ్రేమ్​ స్వాన్​. స్పిన్నర్లు ఓపికతో బౌలింగ్​ చేస్తే వికెట్లు రావడం పెద్ద కష్టమేమీ కాదని తెలిపాడు. ఇండియా టూర్​లో స్పిన్నర్ లీచ్​ కీలకం కానున్నాడని అభిప్రాయపడ్డాడు.

England spinners need to be patient, Leach's accuracy key to success in India
'ఓపికతో బౌలింగ్​ చేయండి- వికెట్లు అవే వస్తాయి'
author img

By

Published : Jan 24, 2021, 3:45 PM IST

భారత్​లో జరుగనున్న టెస్టు సిరీస్​ కోసం తమ ఆటగాళ్లకు పలు సూచనలు చేశాడు ఇంగ్లాండ్​ మాజీ బౌలర్​ గ్రేమ్​ స్వాన్​. స్పిన్నర్లు ఓపికతో బౌలింగ్​ చేస్తే వికెట్లు సులభంగా వస్తాయని సూచించాడు. తుది జట్టులో జాక్​ లీచ్​కు స్థానం కల్పిస్తే.. అతడు ఈ పర్యటనలో కీలక పాత్ర పోషిస్తాడని అభిప్రాయపడ్డాడు.

"ప్రస్తుత శ్రీలంక పర్యటనలో ఇంగ్లాండ్​ తొలి టెస్టు గెలిచింది. అందులో లీచ్​, డామ్​ బెస్​ స్పిన్​ ద్వయం కీలక పాత్ర పోషించింది. ఇరువురూ చెరో 5 వికెట్లతో మెరిశారు. అదే రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో మాత్రం వీరిద్దరు ప్రభావం చూపలేకపోయారు" అని ఈ వెటరన్​ స్పిన్నర్​ తెలిపాడు.

నేను తీసుకున్న మొత్తం 255 టెస్టు వికెట్లలో 60 భారత్​లో తీసినవే. ​ శ్రీలంక, బంగ్లాదేశ్​లలోనూ 25 సగటుతో వికెట్లు పడగొట్టాను. 2008 నుంచి 2013 మధ్య కాలంలో 60 టెస్టులు ఆడిన నాకు.. ఉపఖండం పిచ్​లపై వికెట్ల తీయడం చాలా బాగా తెలుసు.

-గ్రేమ్​ స్వాన్​, ఇంగ్లాండ్​ మాజీ స్పిన్​ బౌలర్​.

"నేను చెప్పదల్చుకుంది ఒకటే విషయం. అవి స్పిన్​కు అనుకూలించే పిచ్​లు. అవన్నీ ఫ్లాట్​ పిచ్​లు. మీరు బౌలింగ్​ బాగా చేస్తే చాలు. ముఖ్యంగా ఇండియాతో ఆడుతున్నప్పుడు.. వాళ్లు చాలా గౌరవంగా ఆడుతారు. ప్రస్తుత జట్టులో వీరేంద్ర సెహ్వాగ్​ లేడు. విరాట్​ కోహ్లి ఉన్నప్పటికీ అతడు స్పిన్ బౌలింగ్​లో చెత్త బంతి కోసమే వేచి చూస్తాడు" అని స్వాన్​ పేర్కొన్నాడు.

ఇండియా కంటే ఓపికగా ఆడాలి..

ఇండియా ఎంతో ఓపికతో ఆడుతుంది. మీరు అంతకంటే ఓపికతో రోజంతా బౌలింగ్​ చేస్తే వికెట్లు నేలకూలడం ఎంతో సులభం. వారిపై పైచేయి సాధించడానికి శ్రమించాల్సి ఉంటుంది. కొంత అసహనం రావొచ్చు. దాని వల్ల పోయేదేమి లేదు.

లీచ్​ కీలకమవుతాడు..

రానున్న భారత పర్యటనలో స్పిన్​ బౌలర్​ జాక్​ లీచ్​ కీలకం కానున్నాడని తెలిపాడు స్వాన్​. 'అతడు మిడిల్​ పిచ్​, మిడిల్​ స్టంప్​, స్ట్రైట్​ డెలివరీలను సంధించాలి. ఇలా చేస్తే ఓ ఎండ్​లో 40 ఓవర్ల పాటు కట్టడి చేసినట్లే. మరో ఎండ్​లో అతనికి సహకరిస్తూ మార్క్​ వుడ్​, జేమ్స్ అండర్సన్, స్టువర్ట్​ బ్రాడ్​లు బౌలింగ్​ చేయాలి' అని తెలిపాడు.

ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న భారత పర్యటనలో.. ఇంగ్లాండ్​ నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​తో పాటు 5 మ్యాచ్​ల టీ-20 సిరీస్​, మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ ఆడనుంది.​

ఇదీ చదవండి: 'టీమ్​ఇండియా గెలవడానికి టిమ్​పైన్​ కారణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.