భారత్-ఇంగ్లాండ్ మూడో టీ20లో టాస్ గెలిచిన మోర్గాన్ సేన బౌలింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో ఉన్న ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి పైచేయి సాధించాలని భావిస్తున్నాయి.
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకుర్, యుజ్వేంద్ర చాహల్.
ఇంగ్లాండ్: జేసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
మోర్గాన్ వందో టీ20..
భారత్‌తో జరుగుతున్న మూడో టీ20.. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు వందో మ్యాచ్. ఈ ఫీట్ సాధించిన తొలి ఇంగ్లిష్ క్రికెటర్ కాగా.. మొత్తం మీద నాలుగో ఆటగాడు. ఈ జాబితాలో షోయబ్ మాలిక్, రోహిత్ శర్మ, రాస్ టేలర్.. ఇయాన్ కంటే ముందున్నారు. వందో మ్యాచ్ ఆడుతున్న మోర్గాన్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపింది.
-
Our captain ❤️
— England Cricket (@englandcricket) March 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
100 IT20 matches 👏@Eoin16 🙌 pic.twitter.com/qX4TUWSDlT
">Our captain ❤️
— England Cricket (@englandcricket) March 16, 2021
100 IT20 matches 👏@Eoin16 🙌 pic.twitter.com/qX4TUWSDlTOur captain ❤️
— England Cricket (@englandcricket) March 16, 2021
100 IT20 matches 👏@Eoin16 🙌 pic.twitter.com/qX4TUWSDlT
ఇదీ చదవండి: ధోనీ ఫిట్‌నెస్‌పై సీఎస్కే కోచ్ ఏమన్నాడంటే...