ETV Bharat / sports

ఇంగ్లాండ్​ను ఆదుకున్న రాయ్​.. భారత్​ లక్ష్యం 165 - భారత్xఇంగ్లాండ్

రెండో టీ20లో టాస్​ ఓడి బ్యాంటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​.. నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి.. 164 పరుగులు చేసింది. జేసన్​ రాయ్​ 46 పరుగులు చేసి జట్టులో టాప్​ స్కోరర్​గా నిలిచాడు. భారత్​ తరఫున శార్దూల్​, సుందర్​ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

MATCH FIRST HALF
MATCH FIRST HALF
author img

By

Published : Mar 14, 2021, 8:50 PM IST

Updated : Mar 14, 2021, 9:02 PM IST

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్​తో జరుగుతున్న రెండో టీ20లో ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి​ 164 పరుగులు సాధించింది. ఓపెనర్​ జేసన్​ రాయ్​(46) ఇన్నింగ్స్​ టాప్​ స్కోరర్​గా నిలవగా.. భారత్​ తరఫున శార్దూల్​ ఠాకూర్​ 2, వాషింగ్టన్​ సుందర్ 2​, చాహల్​ 1, భువనేశ్వర్ 1​ వికెట్​ తీశారు.

england-sets-target-of-165-for-india-in-2nd-t20
టీమ్​ఇండియా

ఆదుకున్న రాయ్​...

టాస్​ ఓడి బ్యాంటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్​లోనే.. ఓపెనర్​ జోస్​ బట్లర్​ను భువనేశ్వర్​ కుమార్​ ఎల్​బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపించాడు. అప్పటికి ఇంగ్లాండ్​ స్కోరు 1. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్​ మలన్​తో పాటు మరో ఓపెనర్​ జేసన్​ రాయ్​ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. కానీ చాహల్​.. తన స్పిన్​తో మలన్​ను ఔట్​ చేశాడు. మంచి దూకుడు మీద కనపడ్డ రాయ్(46)​.. ప్రమాదకరంగా మారుతున్న సమయంలో వాషింగ్టన్​ సుందర్​ అతడిని పెవీలియన్​కు పంపించాడు.

జేసన్​ రాయ్​

మోర్గాన్(28), బెయిర్​ స్టో (20), బెన్​స్టోక్స్​(24) ఫర్వాలేదనిపించారు.​

రివర్స్​ స్వీప్​ల జోరు...

ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్​లో రివర్స్​ స్వీప్​ల జోరు కనపడింది. టీమ్​ఇండియా స్పిన్​ అస్త్రాన్ని ఎదుర్కొనేందుకు ఇంగ్లీష్​ బ్యాట్స్​మెన్​ రివర్స్​ స్వీన్​ను ఎంచుకున్నట్టు కనపడుతోంది. చాహల్​, సుందర్​ బౌలింగ్​లో బ్యాట్స్​మెన్​ అనేకమార్లు రివర్స్​ స్వీప్​కు ప్రయత్నించారు. వీటిలో చాలా వరకు ఫోర్లుగా మలచడం విశేషం.

5 మ్యాచ్​ల టీ20 సిరీస్​లో.. తొలి మ్యాచ్​లో టీమ్​ఇండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్​లో గెలవాలన్న కసి మీద ఉన్న కోహ్లీ సేన.. లక్ష్యాన్ని ఛేదనలో ఏ మేరకు ప్రదర్శన చేస్తుందనేది వేచి చూడాలి.

ఇదీ చూడండి: ధోనీ న్యూ లుక్.. ఐపీఎల్ ప్రోమో​ అదిరిందిగా

Last Updated : Mar 14, 2021, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.