ETV Bharat / sports

ఇంగ్లాండ్​ ఆటగాళ్లకు కరోనా నెగెటివ్​ - india vs eng

సుదీర్ఘ పర్యటన నిమిత్తం భారత్​కు వచ్చిన ఇంగ్లాండ్​ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ కొవిడ్​ నెగెటివ్​గా తేలిందని ఇంగ్లాండ్​ క్రికెట్​ ట్వీట్​ చేసింది.

england-players-test-negative-for-covid-19-on-arrival
ఇంగ్లాండ్​ ఆటగాళ్లకు కరోనా నెగెటివ్​
author img

By

Published : Jan 27, 2021, 10:59 PM IST

టెస్ట్​, వన్డే, టీ20 సిరీస్​ల ​ నిమిత్తం భారత్​ చేరుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వారందరికీ కొవిడ్​ నెగెటివ్​ వచ్చినట్లు ఇంగ్లాండ్​ క్రికెట్​.. ట్విట్టర్​ వేదికగా పేర్కొంది. శ్రీలంక నుంచి చార్టర్​ ఫ్లైట్​లో నేరుగా చెన్నై చేరుకుంది ఇంగ్లీష్​ టీమ్​.

బుధవారం సాయంత్రానికి భారత కెప్టెన్​ కోహ్లీ మినహా ఇరు జట్ల ఆటగాళ్లు.. లీలా ప్యాలెస్​లోని బయో బబుల్​లోకి ప్రవేశించారు. కోహ్లీ కొంచెం ఆలస్యంగా వారితో కలుస్తాడని జట్టు వర్గాలు వెల్లడించాయి.

ఫిబ్రవరి 1 వరకు ఇరు జట్లు ప్రాక్టీస్​లో పాల్గొనేది లేదని ఎంఏ చిదంబరం స్టేడియం అధికారులు తెలిపారు. తర్వాతి రోజు నుంచి అనుమతిస్తామని పేర్కొన్నారు.

భారత్​ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్.. నాలుగు టెస్టుల సిరీస్​తో పాటు 5 టీ-20లు, 3 వన్డేలు ఆడనుంది. చెన్నై వేదికగా తొలి టెస్టు ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: 'పృథ్వీషా.. ఆ పనులు వెంటనే చేసేయ్​'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.