ETV Bharat / sports

'మొతేరాలో వేడి తట్టుకోలేకపోయా.. 5 కేజీల బరువు తగ్గా' - మొతేరా టెస్టు

అహ్మదాబాద్​లో వేడి వాతావరణం కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపాడు ఇంగ్లాండ్ ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​. నాలుగో టెస్టుకు ముందే తమ జట్టు ఆటగాళ్లు డయేరియా బారిన పడ్డట్లు పేర్కొన్నాడు. వారం వ్యవధిలోనే.. 5 కేజీల బరువు తగ్గినట్లు స్టోక్స్ తెలిపాడు.

England players suffered weight loss in fourth Test against India, says Stokes
'మొతేరాలో వేడి తట్టుకోలేకపోయా- 5 కేజీల బరువు తగ్గాను'
author img

By

Published : Mar 9, 2021, 12:50 PM IST

టీమ్ఇండియాతో జరిగిన నాలుగో టెస్టుకు సంబంధించి పలు విషయాలు వెల్లడించాడు ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్ బెన్​ స్టోక్స్​. ఈ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్​లో వేడి వాతావరణం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. సిరీస్​ నిర్ణయాత్మక టెస్టుకు ముందే తమ జట్టుకు చెందిన పలువురు ఆటగాళ్లు డయేరియా బారిన పడ్డట్లు పేర్కొన్నాడు. 41 డిగ్రీల ఎండలో ఆడడం సవాలుతో కూడుకున్నదని అభిప్రాయపడ్డాడు.

వేడి వాతావరణం కారణంగా కేవలం వారంలోనే తాను 5 కేజీల బరువు తగ్గినట్లు స్టోక్స్ తెలిపాడు. డామ్​ సిబ్లే 4 కేజీలు, జిమ్మీ అండర్సన్​ 3 కేజీల బరువు కోల్పోయారని వెల్లడించాడు. జాక్​ లీచ్​ అయితే బౌలింగ్​ స్పెల్స్​ మధ్యలో పదే పదే మూత్రశాలకు వెళ్లాడని పేర్కొన్నాడు. అనారోగ్యానికి గురైనప్పటికీ బరిలోకి దిగామన్నాడు.

"ఇంగ్లాండ్​ విజయానికి ఆటగాళ్లు పూర్తిగా శ్రమించారు. 41 డిగ్రీల ఎండలో ఆడటం అంటే సవాలే. ఇవి ఓటమి గురించి చెప్తున్న సాకులు కాదు. వాషింగ్టన్​ సుందర్​, రిషభ్ పంత్​ అద్భుత ప్రదర్శన చేశారు. మా నుంచి విజయాన్ని దూరం చేశారు."

-బెన్​ స్టోక్స్​, ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​.

మాజీల విమర్శలను పట్టించుకోవద్దు..

3-1తేడాతో టెస్టు సిరీస్​ను కోల్పోయిన ఇంగ్లాండ్​పై ఆ దేశ మాజీలు విమర్శలు చేసిన నేపథ్యంలో స్టోక్స్​ స్పందించాడు. వాటిని పట్టించుకోవాల్సిన పని లేదని.. ఆటపై దృష్టి సారించాలని యువ ఆటగాళ్లకు సూచించాడు. "విమర్శలు చేయడమే వారి పని. ఆటలో పురోగతి సాధించడం మన పని" అని తెలిపాడు.

ఇదీ చదవండి: సచిన్, సెహ్వాగ్​ల మధ్య సరదా సంభాషణ.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.