యాషెస్ చివరి టెస్ట్ నెగ్గేందుకు ఉవ్విళ్లూరుతోంది ఇంగ్లాండ్ జట్టు. మూడో రోజు ఆటలో 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం 382 పరుగులు.
-
Stumps at The Oval!
— ICC (@ICC) September 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
England will resume tomorrow 313/8 with Jofra Archer and Jack Leach at the crease.
They lead Australia by 382 runs, Joe Denly (94) and Ben Stokes (67) the stars with bat adding 127 for the fourth wicket 👏 pic.twitter.com/UoB6foTLP9
">Stumps at The Oval!
— ICC (@ICC) September 14, 2019
England will resume tomorrow 313/8 with Jofra Archer and Jack Leach at the crease.
They lead Australia by 382 runs, Joe Denly (94) and Ben Stokes (67) the stars with bat adding 127 for the fourth wicket 👏 pic.twitter.com/UoB6foTLP9Stumps at The Oval!
— ICC (@ICC) September 14, 2019
England will resume tomorrow 313/8 with Jofra Archer and Jack Leach at the crease.
They lead Australia by 382 runs, Joe Denly (94) and Ben Stokes (67) the stars with bat adding 127 for the fourth wicket 👏 pic.twitter.com/UoB6foTLP9
డెన్లీ డాషింగ్ ఇన్నింగ్స్...
మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను 9/0 వద్ద ఆటను ఆరంభించిన ఇంగ్లాండ్... ఓపెనర్లు బర్న్స్(20), కెప్టెన్ రూట్(21) తక్కువ పరుగులకే పరిమితమయ్యారు. అయితే మరో ఓపెనర్ జో డెన్లీ 94 పరుగులతో(266 బంతుల్లో;14 ఫోర్లు, 1సిక్సర్) రాణించాడు. ఆసీస్ పేసర్ సిడిల్ బౌలింగ్‌లో చెత్త షాట్‌కు ప్రయత్నించి స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఫలితంగా తృటిలో శతకం చేజార్చుకున్నాడు.
ప్రపంచకప్ హీరో, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 67(115 బంతుల్లో; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు మరోసారి కీలక భాగస్వామ్యం అందించాడు. వీళ్లిద్దరూ వెనుదిరిగాక బట్లర్(47) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఒక దశలో ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 305 స్కోరుతో నిలిచింది. అయితే మూడో రోజు చివర్లో రెండు వికెట్లు వెంటవెంటనే పడ్డాయి. ఆట ఆఖరుకు ఆర్చర్ (3), లీచ్(5) క్రీజులో ఉన్నారు.
-
An innings that deserved more @joed1986! 👏
— England Cricket (@englandcricket) September 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Full highlights: https://t.co/P3vwjLT4UZ pic.twitter.com/nWUD48G3IF
">An innings that deserved more @joed1986! 👏
— England Cricket (@englandcricket) September 14, 2019
Full highlights: https://t.co/P3vwjLT4UZ pic.twitter.com/nWUD48G3IFAn innings that deserved more @joed1986! 👏
— England Cricket (@englandcricket) September 14, 2019
Full highlights: https://t.co/P3vwjLT4UZ pic.twitter.com/nWUD48G3IF
ఆసీస్ బౌలర్లలో లైయన్ 65 పరుగులిచ్చి 3 వికెట్లు, సిడిల్ 52 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించారు. మిచెల్ మార్ష్ కేవలం 4 రన్స్‌కే 2 వికెట్లు తీశాడు.
ఇంకా రెండు రోజుల ఆట మిగిలుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ చేతిలో 2 వికెట్లు ఉన్నాయి. ఇప్పటికే ఆసిస్ ముందు భారీ స్కోరు ఉంచిన ఇంగ్లీష్ జట్టు...తమ బౌలింగ్‌లోనూ ప్రతిభ చూపిస్తే ఈ మ్యాచ్ నెగ్గడం కష్టమేమి కాదు. ప్రస్తుతం సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది.
ఇదీ చదవండి...