తొలి టెస్టులో అనూహ్యంగా దెబ్బతిన్న ఇంగ్లాండ్.. రెండో టెస్టులో పుంజుకుని వెస్టిండీస్‌పై ప్రతీకారం తీర్చుకుంది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ నేపథ్యంలో మూడో మ్యాచ్‌లో విజయం ఎవరివైపు నిలుస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాంచెస్టర్ వేదికగా నిర్ణయాత్మక టెస్టు జరగనుంది. విజ్డెన్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇరు జట్లు హోరాహోరీగా పోరాడే అవకాశాలున్నాయి.
వెస్టిండీస్..
అంతకుముందు వెస్టిండీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో విజ్డెన్ ట్రోఫీని ముద్దాడింది ఆతిథ్య జట్టు. ప్రస్తుతం జరుగుతోన్న సిరీస్‌లో గెలుపొందినా లేదా మ్యాచ్‌ను డ్రా గా ముగించి కప్పు తమ దగ్గరే పెట్టుకోవాలని భావిస్తోంది విండీస్.
![westindies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11windies_team_2307newsroom_1595512055_728.jpg)
ఇంగ్లాండ్
గతసారి జరిగిన విజ్డెన్ ట్రోఫీలో వెస్డిండీస్‌పై ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఇంగ్లీష్ జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పును ముద్దాడాలనే తపనతో ఉంది.
ప్రస్తుత సిరీస్ తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని అందుకున్న రూట్ సేన.. రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. చివరి రోజు విండీస్‌కు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లీష్ జట్టు.. 198 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. అయితే మూడో టెస్టులోనూ ఎలాగైనా ప్రత్యర్థి జట్టును మట్టికరిపించి ట్రోఫీని అందుకోవాలని చూస్తోంది ఇంగ్లాండ్.
![england](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03englandtestshirts_2307newsroom_1595512055_67.jpg)
ఇంగ్లీష్ జట్టకు కలిసొచ్చే అంశాలు
ఓపెనింగ్ టెస్టులో అద్భుతంగా రాణించాడు పేసర్ జోఫ్రా ఆర్చర్. అనంతరం కరోనా నిబంధనలను అతిక్రమించి ఇంటికి వెళ్లిన కారణంగా అతడిపై మ్యాచ్ నిషేధం సహా భారీ జరిమానా పడింది. అయితే ఇతడు మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం వల్ల జట్టుకు మరింత బలం చేకూరే అవకాశాలున్నాయి. ఇతడితో పాటు ఇంగ్లాండ్ జట్టులో జేమ్స్ అండర్సన్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
![england](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/england-west-indies-test-fb_2307newsroom_1595512055_55.jpg)
జట్లు:
ఇంగ్లాండ్ : జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరే బర్న్స్, జోస్ బట్లర్, జాక్ క్రాలే, జో డెన్లీ, ఆలీ పోప్, డోమ్ సిబ్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, జేమ్స్ బ్రేసీ, సామ్ కరన్, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, సాకిబ్ మహమూద్, క్రెయిగ్ ఓవర్టన్, ఆలీ రాబిన్సన్, ఆలీ స్టోన్.
వెస్టిండీస్ : జేసన్ హోల్డర్ (సి), జెర్మైన్ బ్లాక్‌వుడ్, ఎన్‌క్రుమా బోన్నర్, క్రైగ్ బ్రాత్‌వైట్, షమర్ బ్రూక్స్, జాన్ కాంప్‌బెల్, రోస్టన్ చేజ్, రాహకీమ్ కార్న్‌వాల్, షేన్ డౌరిచ్, షానన్ గాబ్రియేల్, కెమర్ హోల్డర్, షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, రేమోన్ రీఫెర్, కేమర్ రోచ్.
-
#ENGvWI The RED HOT Test action continues on Friday in the 3rd Test. Don't you dare miss a ball!🙌🏾#MenInMaroon #WIReady pic.twitter.com/Af6RQ5Nwt5
— Windies Cricket (@windiescricket) July 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#ENGvWI The RED HOT Test action continues on Friday in the 3rd Test. Don't you dare miss a ball!🙌🏾#MenInMaroon #WIReady pic.twitter.com/Af6RQ5Nwt5
— Windies Cricket (@windiescricket) July 21, 2020#ENGvWI The RED HOT Test action continues on Friday in the 3rd Test. Don't you dare miss a ball!🙌🏾#MenInMaroon #WIReady pic.twitter.com/Af6RQ5Nwt5
— Windies Cricket (@windiescricket) July 21, 2020
-
#ENGvWI It all comes down to the 3rd Test tomorrow at 6 A.M. AST.⏰ Follow the ball by ball action on https://t.co/RET8xTQxa4 📲#MenInMaroon #WIReady pic.twitter.com/whM2pitEN1
— Windies Cricket (@windiescricket) July 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#ENGvWI It all comes down to the 3rd Test tomorrow at 6 A.M. AST.⏰ Follow the ball by ball action on https://t.co/RET8xTQxa4 📲#MenInMaroon #WIReady pic.twitter.com/whM2pitEN1
— Windies Cricket (@windiescricket) July 23, 2020#ENGvWI It all comes down to the 3rd Test tomorrow at 6 A.M. AST.⏰ Follow the ball by ball action on https://t.co/RET8xTQxa4 📲#MenInMaroon #WIReady pic.twitter.com/whM2pitEN1
— Windies Cricket (@windiescricket) July 23, 2020
ఇది చూడండి : విండీస్‌పై ఇంగ్లాండ్ విజయం.. సిరీస్ 1-1తో సమం