ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది ఇంగ్లాండ్ జట్టు. అయితే మ్యాచ్‌లో ఇంగ్లీష్ స్పిన్నర్ అదిల్ రషీద్ ఓ రికార్డును సాధించాడు. వన్డేల్లో 150 వికెట్లు సాధించిన తొలి ఇంగ్లాండ్ స్పిన్నర్‌గా ఘనత వహించాడు.
ఈ మ్యాచ్‌లో హార్రే టెక్టార్ (28), లోర్కేన్ టక్కర్ (21), కెవిన్ ఓబ్రెయిన్ (3)లను పెవిలియన్ చేర్చాడు రషీద్. తద్వారా 150 వికెట్ల క్లబ్లో చేరాడు. 102 మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.
రషీద్ కంటే ముందు ఇంగ్లాండ్ తరఫున ఎక్కువ వికెట్లు సాధించిన స్పిన్నర్‌గా ఉన్నాడు గ్రేమ్ స్వాన్. ఇతడు 104 వికెట్లు సాధించి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాగే వన్డేల్లో ఇంగ్లాండ్ తరఫున ఎక్కువ వికెట్లు (269) సాధించిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు జేమ్స్ అండర్సన్. తర్వాత డారెన్ గౌ (234), స్టువర్ట్ బ్రాడ్ (178), ఆండ్రూ ఫ్లింటాఫ్ (168) ఉన్నారు.