ETV Bharat / sports

రెండో టెస్టులో పట్టు బిగించిన భారత్​

చెన్నై వేదికగా ఇంగ్లండ్​తో జరుగుతున్న రెండో టెస్ట్​లో టీమ్​ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రత్యర్థి టీమ్​ను ఫాలోఆన్​ ఆడించకుండా మరోసారి బ్యాటింగ్​కు దిగిన భారత్​.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్​ నష్టానికి 54 పరుగులు చేసింది.

ENG VS IND 2ND TEST
ఒకేరోజు నేలకూలిన 15వికెట్లు- భారీ ఆధిక్యం దిశగా భారత్​
author img

By

Published : Feb 14, 2021, 4:53 PM IST

ఇంగ్లండ్​తో టెస్ట్​ సిరీస్​లో భాగంగా తొలి టెస్ట్​లో ఘోర పరాభావంతో రెండో టెస్ట్​ ఆరంభించిన టీమ్​ ఇండియా.. రెండో టెస్ట్​లో ప్రతీకారం దిశగా ముందడుగేస్తోంది. రెండో రోజే పర్యాటక జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత జట్టు.. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 195 పరుగుల తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యంతో చివరి సెషన్​లో బ్యాటింగ్​ ఆరంభించిన ఆతిథ్య టీమ్​.. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్​ కోల్పోయి 54 పరుగులు చేసింది. దీంతో మొత్తం ఆధిక్యం 249పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్​లో శతక్కొట్టిన ఓపెనర్​ రోహిత్​ శర్మ (25*​)తో పాటు ఫస్ట్​డౌన్​లో వచ్చిన పుజారా(7*) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్​లో​ 134 పరుగులకు ఆలౌట్​ అయింది. దీంతో ఆ జట్టు మరోసారి బ్యాటింగ్​కు వస్తుందని భావించారు. కానీ.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే వ్యూహంతో.. ఫాలోఆన్​ ఆడించకుండానే భారత్​ బ్యాట్స్​మెన్​ క్రీజులోకి అడుగుపెట్టారు. తొలి ఇన్నింగ్స్​లో డకౌట్​ అయిన ఓపెనర్​ శుభ్​మన్​ గిల్(14)​ నిలకడగా బ్యాటింగ్​ చేస్తూ.. నిలదొక్కుకునే క్రమంలోనే జాక్​ లీచ్​ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 42 పరుగులకు తొలి వికెట్​ కోల్పోయింది టీమ్​ ఇండియా.

ఇదీ చదవండి: చెన్నై టెస్ట్​లో తిప్పేసిన భారత్​- ఇంగ్లండ్​ 134 ఆలౌట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.