ETV Bharat / sports

విజయ్​తో డిన్నర్​కు ఆసీస్ మహిళా క్రికెటర్ - క్రికెటర్ మురళీ విజయ్ వార్తలు

టీమిండియా బ్యాట్స్​మన్ మురళీ విజయ్​తో డిన్నర్​కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది ఆసీస్ మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ.

విజయ్​తో డిన్నర్​కు ఆసీస్ మహిళా క్రికెటర్
మురళీ విజయ్ ఎల్లీస్ పెర్రీ
author img

By

Published : May 4, 2020, 12:18 PM IST

భారత సీనియర్ ఆటగాడు మురళీ విజయ్ విజ్ఞప్తిపై ఆసీస్ మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ స్పందించింది. డిన్నర్​కు వెళ్లేందుకు సిద్ధమని చెప్పింది. బిల్ మాత్రం అతడే కట్టాలని తెలిపింది. సోనీస్పోర్ట్స్​ నిర్వహించిన లైవ్​చాట్​లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించింది.

కొన్నిరోజుల క్రితం చెన్నై సూపర్​కింగ్స్​ నిర్వహించిన లైవ్​చాట్​లో పాల్గొన్నాడు క్రికెటర్ మురళీ విజయ్. డిన్నర్​కు ఏ ఇద్దరు క్రికెటర్లతో వెళ్లాలనుకుంటారు? అనే ప్రశ్నకు సమాధానంగా ఎల్లీస్ పెర్రీ, శిఖర్ ధావన్​ల పేర్లు చెప్పాడు. ఆమె అందంగా ఉంటుందని, కుదిరితే డిన్నర్​ చేయాలనుందని విజయ్ అన్నాడు. తాజాగా దీనిపై స్పందించిన మహిళా క్రికెటర్.. తాను అందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది.

భారత్​ తరఫున 2018లో చివరగా టెస్టు ఆడిన మురళీ విజయ్.. జట్టులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా స్థిరపడటం వల్ల చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.