ETV Bharat / sports

క్రికెటర్​కు కరోనా సోకితే ప్రత్యామ్నాయం ఏంటి? - England wales cricket board

త్వరలో వెస్టిండీస్​తో జరగబోయే టెస్టు సిరీస్​లో​ కొవిడ్​-19 బాధిత క్రికెటర్​కు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తోంది ఇంగ్లాండ్ బోర్డు. ఇదే విషయమై ఐసీసీతో చర్చలు జరుపుతోంది.

ECB wants ICC allow COVID-19 substitutes for upcoming matches
ఆటగాడికి కరోనా సోకితే ప్రత్యామ్నాయం ఉంటుందా?
author img

By

Published : May 30, 2020, 2:47 PM IST

క్రికెట్ మ్యాచ్​ జరుగుతున్నప్పుడు ఓ ఆటగాడు కరోనా బారిన పడితే, అతడికి ప్రత్యామ్నాయం ఉండాలనే విషయంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తో చర్చలు జరుపుతోంది. అనుకున్నట్లు జరిగితే త్వరలో వెస్టిండీస్​తో జరగబోయే టెస్టు సిరీస్​తో దీనిని అమలు చేయనున్నారు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎవరైనా గాయంతో, మరే ఇతర ఆరోగ్య సమస్యలతో మైదానాన్ని వీడితే మరొక ఆటగాడిని ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకోవచ్చు. కానీ, అతడికి బ్యాటింగ్​ లేదా బౌలింగ్​ చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు కొవిడ్-19కు ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టింది ఈసీబీ.

ప్రస్తుతం యూకే​లో క్రికెట్​కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు జులై 1 వరకు నిలిపివేశారు. ఇందువల్ల జూన్​లో వెస్డిండీస్​తో జరగాల్సిన మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్ జులైకు​ వాయిదా పడింది. అయితే ఈ మ్యాచ్​ల్ని ప్రేక్షకులు లేకుండా, బయో సెక్యూర్​ వాతావరణంలో నిర్వహిస్తే ఆడేందుకు సిద్ధమని వెస్టిండీస్​ క్రికెట్​ బోర్డు తెలిపింది.

ఇదీ చూడండి... ఆ ఐపీఎల్​ జట్టులో ధోనీకి దక్కని చోటు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.