ETV Bharat / sports

ధోనీ పుట్టినరోజు కానుకగా 'హెలికాప్టర్' - dhoni birthday

త్వరలో పుట్టినరోజు జరుపుకోనున్న భారత మాజీ సారథి ధోనీపై 'హెలికాప్టర్' పాటను రూపొందించాడు విండీస్ క్రికెటర్ బ్రావో. వీరిద్దరూ ఐపీఎల్​ చెన్నై సూపర్​కింగ్స్ జట్టుకు ఆడుతున్నారు.

ఐపీఎల్​లో ధోనీతో బ్రావో
బ్రావో ధోనీ
author img

By

Published : Jun 29, 2020, 9:31 PM IST

అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ. టీమ్‌ఇండియాకు 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌, 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ అందించాడు. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను మూడుసార్లు విజేతగా నిలిపాడు. జులై 7న మహీ పుట్టినరోజు. అతడు 39వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఈ సందర్భంగా వెస్టిండీస్‌ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావో అప్పుడే సంబరాలు మొదలుపెట్టాడు. అతడికి ధోనీ అంటే ఎంతో ఇష్టం. వీరిద్దరి మధ్య విడదీయరాని స్నేహబంధం ఉంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఈ ద్వయం ఎన్నో అద్భుతాలు చేసింది. ఈ పుట్టిన రోజుకు 'హెలికాప్టర్‌' పాటను ధోనీకి బ్రావో అంకితమివ్వనున్నాడు.

బ్రావో అద్భుతమైన గాయకుడు. మంచి డాన్సర్‌. తానే స్వయంగా పాటలు రాసి వీడియోలు చేస్తాడు. అతడు రూపొందించిన 'డీజే.. ఛాంపియన్‌‌' పాట ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం 'హెలికాప్టర్‌' పాట టీజర్‌ను విడుదల చేశాడు.

'జులై 7కు మీరంతా సిద్ధమేనా!! ఆ రోజు మహీ పుట్టినరోజు. మేమంతా అతడి జన్మదిన వేడుకలను ఛాంపియన్‌ టీమ్‌ రూపొందించిన ప్రత్యేకమైన పాటతో జరుపుకోబోతున్నాం. గాయ్స్‌.. మమ్మల్ని ట్యాగ్‌ చేయడం మర్చిపోవద్దు. మీ అందరి హెలికాప్టర్‌ డాన్స్‌ చూడనివ్వండి' అని బ్రావో ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకున్నాడు. త్వరలో పూర్తి పాటను విడుదల చేస్తానని పేర్కొన్నాడు.

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2019 తర్వాత మహేంద్రసింగ్‌ ధోనీ మైదానంలో కనిపించలేదు. అతడి వీడ్కోలుపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఫామ్‌, ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక పోటీల్లో ఉంటాడని కోచ్‌ రవిశాస్త్రి, తదితరులు స్పష్టం చేశారు. అయితే కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడింది. టీ20 ప్రపంచకప్‌ వాయిదాపై ఇంకా స్పష్టత రాలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.