ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్‌పై స్ఫూర్తిదాయక ఆట ప్రదర్శించింది వెస్టిండీస్. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించింది కరీబియన్ జట్టు.
ప్రస్తుత ఫాంను బట్టి చూస్తే రాబోయే ప్రపంచకప్‌లో వెస్టిండీస్ ప్రమాదకారి అని ఆ దేశ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో విశ్లేషించాడు. ఇంగ్లండ్ జట్టుపై అదిరే ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచిందని తెలిపాడు.
మా జట్టులో కొందరు యువ ఆటగాళ్లు ఆకట్టుకుంటున్నారు. వారి ఆట రోజురోజుకి మెరుగపడుతోంది. దీన్ని బట్టి చూస్తే ప్రపంచకప్‌లో కరీబియన్ జట్టుతో మిగతా టీమ్‌లకు ప్రమాదమే. తనదైన రోజు ఏ జట్టు అయినా చెలరేగుతుంది. కానీ నేను కచ్చితంగా చెబుతున్నా.. ప్రస్తుతం వెస్టిండీస్ సూపర్ ఫాంలో ఉంది ---డ్వేన్ బ్రావో