ETV Bharat / sports

కెప్టెన్​గా అన్ని ఫార్మాట్లకు గుడ్​బై చెప్పిన డుప్లెసిస్​ - డుప్లెసిస్​ కెప్టెన్సీ

సఫారీ జట్టు ఆటగాడు డుప్లెసిస్​ అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. జట్టుకు కొత్త మార్గదర్శకత్వం అవసరమని అందుకోసమే కెప్టెన్సీని వీడుతున్నట్లు తెలిపాడు.

du Plessis Steps Down As South Africa Captain Across All Formats
కెప్టెన్​గా అన్ని ఫార్మాట్లకు గుడ్​బై చెప్పిన డుప్లెసిస్​
author img

By

Published : Feb 17, 2020, 5:20 PM IST

Updated : Mar 1, 2020, 3:21 PM IST

దక్షిణాఫ్రికా క్రికెట్​ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.​ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టీ20, టెస్టు బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగినట్టు చెప్పాడు. నెల రోజుల ముందు వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నాడు.

"జట్టును ముందుకు నడిపించడానికి కొత్త మార్గదర్శకుడు అవసరం. కెప్టెన్సీ నుంచి వైదొలగినా జట్టుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా. కొత్త నాయకత్వంలో దక్షిణాఫ్రికా జట్టు మరింత ముందుకెళుతుంది."

- డుప్లెసిస్​, దక్షిణాఫ్రికా క్రికెట్​ జట్టు మాజీ కెప్టెన్​

డుప్లెసిస్.. అన్ని ఫార్మాట్లలో 112 మ్యాచ్​లకు​ కెప్టెన్​గా వ్యవహరించాడు. ఇటీవలే ఇంగ్లాండ్​ సిరీస్​కు యాజమాన్యం అతడికి విశ్రాంతినిచ్చింది. దీంతో వన్డే, టీ20 మ్యాచ్​లకు వికెట్​ కీపర్​ డికాక్​ నాయకత్వం వహించాడు.

ఇదీ చూడండి.. టీమిండియాతో తలపడే న్యూజిలాండ్ టెస్టు జట్టిదే

Last Updated : Mar 1, 2020, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.