ETV Bharat / sports

డ్రీమ్​11 ఐపీఎల్​: జీపీఎస్​ ట్రాకర్లతో బయో బుడగ సృష్టి! - IPL 2020 latest news

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 బయో బుడగను రూపొందించే హక్కులను బ్రిటన్‌కు చెందిన రిస్ట్రాటా దక్కించుకుందని తెలిసింది. టాటా గ్రూప్‌ కన్నా తక్కువ మొత్తానికే కొటేషన్‌ వేసింది. భద్రత, సంక్షేమం, రవాణా రంగాల్లో ఈ సంస్థకు మంచి పేరుండటం వల్ల బీసీసీఐ ఈ సంస్థవైపు మొగ్గుచూపినట్లు సమాచారం. సెప్టెంబర్‌ 19 ఈ ఏడాది ఐపీఎల్​ ప్రారంభం కానుంది.

bio bubble news
డ్రీమ్​11 ఐపీఎల్​: బయో బుడగ సృష్టించేది వీరే
author img

By

Published : Aug 21, 2020, 5:31 AM IST

నెలరోజుల్లోనే ఐపీఎల్​ సంబరం మొదలుకానుంది. అయితే ఈసారి భారత్​లో కాకుండా యూఏఈలో ఈ లీగ్​ నిర్వహించనున్నారు.సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు పోటీలు జరగనున్నాయి. ప్రత్యక్షంగా మ్యాచ్​లు చూడలేకపోయినా టీవీ తెరల్లో అభిమానులు మ్యాచ్​లు వీక్షించనున్నారు. అయితే ఆటగాళ్లు, ఫ్రాంఛైజీలు, టోర్నీ నిర్వహకులు ఎదుర్కొనే సవాళ్లు మాత్రం అత్యంత కఠినంగా ఉండబోతున్నాయి. ఇందులో బయోబబుల్​ ఒకటి.

బుడగ గట్టిదేనా?

ఐపీఎల్‌లో బయో బుడగ మరో సవాలే. వెస్టిండీస్‌, పాకిస్థాన్‌తో సిరీసులకు ఇంగ్లాండ్‌ ఇదే ప్రయోగం చేసి విజయవంతమైంది. అయితే అక్కడ కేవలం రెండు జట్లు మాత్రమే సురక్షిత వాతావరణంలో ఉన్నాయి. మొత్తంగా 50 మందికి మించి ఉండరు. కానీ ఐపీఎల్‌లో మాత్రం అత్యంత కష్టం.

ఒక్కో జట్టులో కనీసం 20 మందికి పైగా ఆటగాళ్లు ఉంటారు. కోచింగ్‌, ఫ్రాంఛైజీ సిబ్బంది అదనం. ఒక్కో ఫ్రాంఛైజీ నుంచి అందరూ కలిపి 35 మంది ఉన్నా ఎనిమిది ఫ్రాంఛైజీలకు 280 మంది అవుతారు. వీరే కాకుండా ఐపీఎల్‌ నిర్వహక కమిటీ సభ్యులు, అధికారులు, సాంకేతిక, అంపైరింగ్‌, లాజిస్టిక్స్‌, ప్రసారదారు, రవాణా సిబ్బందీ ఉంటారు. అంటే ఈ లీగ్‌లో మొత్తంగా 350-400 మంది ఉండే అవకాశం ఉంది. అంత మందితో బయో బబుల్‌ విజయవంతమైతే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఆటగాళ్లలో ఏ ఒక్కరికైనా కొవిడ్‌-19 సోకితే ఏం చేస్తారో ఇంకా నిర్ణయించలేదు! క్వారంటైన్‌, చికిత్స, ప్రైమరీ కాంటాక్టుల పరంగా ఏం చేస్తారో తెలియదు.

అనువభమున్న సంస్థకే...!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 బయో బుడగను రూపొందించే హక్కులను బ్రిటన్‌కు చెందిన రిస్ట్రాటా దక్కించుకుందని తెలిసింది. టాటా గ్రూప్‌ కన్నా తక్కువ మొత్తానికే కొటేషన్‌ వేసింది. భద్రత, సంక్షేమం, రవాణా రంగాల్లో ఈ సంస్థకు మంచి పేరుండటం గమనార్హం.

2012లో నిర్వహించిన లండన్‌ ఒలింపిక్స్‌కు పనిచేసిన అనుభవం రీస్ట్రాటాకు ఉంది. వెస్టిండీస్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ సిరీసులకు బయో బుడగ నిర్మించేందుకు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డుకు రీస్ట్రాటానే ఎంచుకోవడం గమనార్హం. టాటా సంస్థ కన్నా అతి తక్కువ ధరకు కోట్‌ వేయడం, అంతర్జాతీయ క్రీడాపోటీల నిర్వహణలో అనుభవం, ఈ మధ్యే జరుగుతున్న క్రికెట్‌ సిరీసుల్లో భాగస్వామ్యం ఉండటం వల్ల బీసీసీఐ ఆ సంస్థపై మొగ్గు చూపింది.

యూఏఈలో ఐపీఎల్‌ను ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు రీస్ట్రాటా కేంద్రీయ బయో బడుగను సృష్టించనుందని అన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ తెలిపింది. బుడగలోని ఆటగాళ్లు, సిబ్బందిని సురక్షితంగా ఉంచేందుకు ఉంగరాలు బ్రాస్‌లెట్లు లేదా మెడలో వేసుకొనే ట్యాగుల్లో జీపీఎస్‌ సెన్సర్లు పెట్టే అవకాశం ఉంది. అప్పుడే భౌతికదూరం పాటించడంపై స్పష్టత ఉంటుంది. వెస్టిండీస్‌తో రెండో టెస్టు ముందు ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ తన కుటుంబ సభ్యులను కలిశాడు. జీపీఎస్‌ ట్రాకర్ల వల్లే అతడు బుడగను దాటాడని గుర్తించగలిగారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.