ETV Bharat / sports

'పంత్ నాకు పోటీ అనుకోవడం లేదు' - Sanju Samson about rishabh pant

రిషభ్ పంత్​, సంజూ శాంసన్​ల మధ్య వికెట్​ కీపింగ్​ కోసం పోటీ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా దీని గురించి మాట్లాడిన సంజూ.. తనకు పంత్ పోటీ అనుకోవడం లేదని, అతడితో కలిసి ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

Don't consider myself competing with him: Sanju Samson on pant
'పంత్​తో పోటీ కాదు.. కలిసి ఆడాలని కోరుకుంటాను'
author img

By

Published : Jun 8, 2020, 9:05 PM IST

టీమ్​ఇండియాలో వికెట్​ కీపర్​ స్థానం కోసం రిషభ్ పంత్​తో పోటీ పడుతున్నాడు యువ క్రికెటర్ సంజు శాంసన్. తాజాగా ఇదే విషయమై స్పందించిన సంజూ.. అతడు తనకు పోటీ అనుకోవడం లేదని, తామిద్దరం కలిసి ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. దీనితో పాటు పలు విషయాలను పంచుకున్నాడు.​

"జట్టు ఎంపిక, కాంబినేషన్​ బట్టి ఉంటుందని అనుకుంటున్నా. పంత్ నాకు పోటీ అనుకోవడం లేదు. అయితే పోటీ అనేది ఆటలో ఉండాలి, ఇతర క్రికెటర్ల స్థానాన్ని ఆక్రమించే దానిపై కాదు. ఒకవేళ అలా చేస్తే అది ఆటగాళ్ల లక్షణం కాదు. పంత్ నాకు పోటీ అని మీరంతా అనుకుంటున్నారు. కానీ, మేమిద్దరం కలిసి ఆడాలని నేను కోరుకుంటున్నా. మా జోడీ బౌలర్లపై ఆధిపత్యం చలాయిస్తే బాగుంటుంది. ఐపీఎల్​లో ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు మేం అదే చేశాం. పంత్​తో కలిసి ఆడాలని నాకు ఎప్పుడూ ఉంటుంది"

- సంజు సామ్​సన్​, టీమ్​ఇండియా క్రికెటర్

ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్​తో జరిగిన 5 టీ20ల సిరీస్​కు ఓపెనర్​ శిఖర్​ ధావన్​కు ప్రత్యామ్నాయంగా సంజు శాంసన్​ను జట్టులోకి తీసుకున్నారు. తొలి మూడు మ్యాచ్​ల్లో ఇతడికి అవకాశం లభించకపోయినా.. అనూహ్యంగా చివరి రెండింటిలో ఓపెనర్​గా బరిలో దిగాడు. కానీ ఆ మ్యాచ్​ల్లో తక్కువ పరుగులకే వెనుదిరిగాడు.

2014లో ఇంగ్లాండ్​తో జరిగిన టీ20 సిరీస్​తో అంతర్జాతీయ కెరీర్​ ప్రారంభించాడు సంజూ​. కానీ, ఆ సిరీస్​లోని కొన్ని మ్యాచ్​ల తర్వాత ధోనీ తిరిగి రావడం వల్ల శాంసన్ బెంచ్​కే పరిమితం కావాల్సి వచ్చింది. ​ఆ తర్వాత ఏడాది జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్​లో పాల్గొన్నాడు​.

సెలెక్టర్ల దృష్టికి

2019/2020 విజయ్​ హజారే ట్రోఫీలో కేరళకు ప్రాతినిధ్యం వహించిన సంజూ​.. గోవాపై 129 బంతుల్లో 212 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత జనవరిలో కివీస్​ పర్యటనకు ఎంపికై టీ20 సిరీస్​కు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆడిన చివరి రెండు మ్యాచ్​ల్లోనూ పేలవ ప్రదర్శన చేసి నిరుత్సాహపరిచాడు.

ఇదీ చూడండి... 'భారత జట్టు బౌలింగ్ ప్రదర్శన అద్భుతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.