భారత బాక్సింగ్‌లో కరోనా కలకలం రేపింది. తాజాగా బాక్సింగ్ జట్టు వైద్యుడు అమోల్ పాటిల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఆయనతో పాటు క్రీడాకారులు అమిత్ పంగాల్, ఆశిష్ కుమార్లకూ వైరస్ సోకినట్లు సాయ్ అధికారులు తెలిపారు. అయితే వీరికి మంగళవారం మరోసారి కొవిడ్ టెస్టులు నిర్వహించనున్నారు.
![Doctor with boxing team tests positive for coronavirus, primary contacts to be retested](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8023919_gdf.jpg)
పటియాలాలోని ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌లో బాక్సింగ్ జట్టుతో ఉన్న పాటిల్.. ప్రధాన క్యాంపస్ వెలుపల క్వారంటైన్లో ఉన్నారు. పంగల్, కుమార్‌ను కూడా డాక్టర్ ఉన్న కేంద్రంలోనే ఉంచారు. పాటిల్‌తో సంబంధమున్న పురుషుల జట్టు ప్రధాన కోచ్ సీఎ కుట్టప్ప, మహిళల హెచ్ కోచ్ మొహద్ అలీ కుమార్.. అసిసెట్ ఖీమానంగ్ బెనవాల్కూ తిరిగి పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
పాటిల్‌కు కరోనా సోకడం వల్ల.. బాక్సర్ల శిక్షణా శిబిరంలో అనిశ్చితి నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. అమిత్ వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో కీలక భారతీయ బాక్సర్ కావడం కలవరపెడుతోంది.