కోల్‌కతా వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలం పూర్తయింది. మొత్తం 338 ఆటగాళ్లు జాబితాలో నిలవగా.. వారిలో 62 మందికి లీగ్‌లో చోటు దక్కింది. వారిలో ఆస్ట్రేలియా క్రికెటర్ కమిన్స్‌ను రూ.15.50 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకోగా... అదే దేశానికి చెందిన మ్యాక్స్‌వెల్‌ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. వీరితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్‌ను రూ.10 కోట్లకు కొనుక్కుంది బెంగళూరు. వీళ్లు టాప్-3లో నిలిచారు. అయితే ఇందులో కనీస ధరకు కూడా అమ్ముడుకాని ఆటగాళ్లు వీళ్లే...
1. భారత ఆటగాళ్లు..
భారత్ నుంచి కోటి రూపాయలతో రేసులో పాల్గొన్న యూసఫ్ ఫఠాన్, వినయ్ కుమార్‌కు ఊహించని దెబ్బ పడింది. వీళ్లను అసలు ఏ ఫ్రాంఛైజీ ఎంపిక చేసుకోలేదు.
50 లక్షల్లో వీళ్లే..
హనుమ విహారి, ఛతేశ్వర్ పుజారా, స్టువర్ట్ బిన్నీ, నమన్ ఓజా,మనోజ్ తివారి, రిషి ధావన్, బరిందర్ శరణ్.
20 లక్షల్లో వీళ్లే..
మన్జోత్ కల్రా, హర్‌ప్రీత్ సింగ్, కేదార్ దేవధర్, అంకుశ్ బైన్స్, విష్ణు వినోద్, కుల్వంత్ కెజ్రోలియా, కార్తీక్ త్యాగి, కేసీ కరియప్ప, సుదేశన్ మిథున్, ఆయుష్ బదోని, ప్రవీణ్ దూబే, షామ్స్ ములని, రాహుల్ శుక్లా, సుమిత్ కుమార్, ఆర్యన్ జుయల్, కుల్దీప్ సేన్, యుద్వీర్ సింగ్, సుజిత్ నాయక్, వైభవ్ అరోరా, సౌరభ్ దూబే, రోహన్ కదమ్, షారుఖ్ ఖాన్, శ్రీకార్ భరత్.
2. దక్షిణాఫ్రికా
సఫారీ జట్టులోని నలుగురు ఆటగాళ్లను వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. వీళ్లందరూ 50 లక్షల కనీస ధరతోనే ఉండటం విశేషం.
క్లాసెన్(50 లక్షలు), కొలిన్ ఇంగ్రామ్(50 లక్షలు), ఆండిలో ఫెలుక్వాయో(50 లక్షలు), ఆండ్రిచ్ నోర్తెజే(50 లక్షలు)
3. న్యూజిలాండ్
గప్తిల్ వంటి హిట్టర్‌ను ఏ జట్టూ కొనేందుకు ఆసక్తి చూపలేదు. ఏడుగురు ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది.
టిమ్ సౌథీ(1 కోటి), మార్టిన్ గప్తిల్(1 కోటి), కొలిన్ మున్రో(1 కోటి)
ఇష్ సోథీ(75 లక్షలు), కొలిన్ డీ గ్రాండ్‌హోమ్(75 లక్షలు)
ఆడమ్ మిల్నే(50 లక్షలు), మ్యాట్ హెన్రీ(50 లక్షలు)
4. వెస్టిండీస్..
భారీ హిట్టర్లుగా పేరున్న కరీబియన్ జట్టు ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఫ్రాంఛైజీలు కాస్త నిరాసక్తత వ్యక్తం చేశాయి.
ఎవిన్ లూయిస్(1 కోటి), జేసన్ హోల్డర్(75 లక్షలు), కార్లోస్ బ్రాత్‌వైట్(50 లక్షలు), అల్జారీ జోసెఫ్(50 లక్షలు), కేసరిక్ విలియమ్స్(50 లక్షలు), హెడన్ వాల్ష్(50 లక్షలు), షాయ్ హోప్(50 లక్షలు)లను కొనుగోలు చేసేందుకు ముఖం చాటేశాయి ఫ్రాంఛైజీలు.
5. బంగ్లాదేశ్..
ముష్ఫికర్ రహీమ్(75 లక్షలు), ముస్తాఫిజుర్ రెహ్మన్(1 కోటి),
6. ఆస్ట్రేలియా..
ఆడమ్ జంపా(1.50 కోట్లు), రిలే మెరేడిత్(40 లక్షలు),సీన్ అబాట్(75 లక్షలు), జేమ్స్ పాటిన్సన్(1 కోటి), నాథన్ ఎలిస్(20 లక్షలు), డేనియల్ శామ్స్(20 లక్షలు), బెన్ కటింగ్(75 లక్షలు)
7. ఆఫ్గనిస్థాన్..
ఈ వేలంలో అతిపిన్న వయసున్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్న నూర్ అహ్మద్‌ను ఎవ్వరూ కొనలేదు.
జహీర్ ఖాన్(50 లక్షలు), నూర్ అహ్మద్(30 లక్షలు),
8. ఇంగ్లాండ్
లియమ్ ప్లంకెట్(1 కోటి), జార్జ్ గార్టన్(20 లక్షలు), మార్క్ ఉడ్(50 లక్షలు)
9. శ్రీలంక
అతి తక్కువగా శ్రీలంక నుంచి ఒక్కరే ఇందులో చోటు దక్కించుకోలేకపోయారు.
కుశల్ పెరెరా(50 లక్షలు)
ఐసీసీ సభ్యత్వం ఉన్న టాప్-10 జట్లలో పాకిస్థాన్ తప్ప అన్ని దేశాలు ఈ లీగ్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.