ETV Bharat / sports

'ఆ రెండు విషయాలు ధోనీ పట్టించుకోడు'

ఐపీఎల్​లో చెన్నె సూపర్​కింగ్స్​ విజయాలకు మహేంద్ర సింగ్​ ధోనీనే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు దిగ్గజ ఆటగాడు​ ద్రవిడ్​. అతడి నిర్ణయాలు, స్మార్ట్​ గేమ్​ సహా బృందంగా వారి పనితీరు బాగుంటుందని పేర్కొన్నారు.

Dhoni's instincts, behind-the-scenes work reason for CSK's success, feel Dravid and Srinivasan
చెన్నై సూపర్​కింగ్స్​ విజయాలకు ధోనీయే కారణం: ద్రవిడ్
author img

By

Published : Aug 2, 2020, 8:38 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​)లో చెన్నై జట్టు రాణించడానికి కారణాలను విశ్లేషించాడు భారత మాజీ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్​. ఆ జట్టు సారథి ధోనీ ఆలోచనా విధానం, స్మార్ట్​ గేమ్​ సహా తెరవెనుక ఆ జట్టు పడే కష్టమే విజయాలకు కారణమని చెప్పాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్​.శ్రీనివాసన్​తో కలిసి ఓ వెబ్​నార్​లో పాల్గొన్న ద్రవిడ్​.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

"సీఎస్​కే విజయాలను చూడండి. వారు మంచి డేటాను సంపాదించుకోగలిగారు. తెరవెనుక బోలెడంత మంది పనిచేస్తారు. జూనియర్​ స్థాయిలో వారు క్రికెట్​ జట్లనూ నడిపిస్తారు. ప్రతిభను అర్థం చేసుకున్న వారు కచ్చితంగా వాటిని ఉపయోగించుకోగలుగుతారు. అందుకు సారథి నిర్ణయాలు, ఆలోచనలు చాలా కీలకం. ధోనీ గురించి నాకు బాగా తెలుసు. డేటా, గణాంకాలను ధోనీ పెద్దగా పట్టించుకోడు. ఎప్పటికీ అలాగే ఉంటాడని అనుకుంటున్నా" అని ద్రవిడ్​ చెప్పాడు.

ఇప్పటికే ఐపీఎల్​ మూడుసార్లు టైటిల్​ను సొంతం చేసుకుంది చెన్నై సూపర్​కింగ్స్. పది సీజన్లలోనూ నాకౌట్​లో అడుగుపెట్టిన ఏకైక జట్టుగా ఘనత సాధించింది.

ధోనీ పట్టించుకోడు

డేటాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయంలోనూ ధోనీ నిర్ణయాలు, ఆలోచనలు జట్టును విజయవంతంగా నడిపించాయని అభిప్రాయపడ్డారు చెన్నై సూపర్​కింగ్స్​ ఫ్రాంచైజీ యజమాని శ్రీనివాసన్.

"ఇప్పుడు మేం డేటాకు దూరంగా ఉంటున్నాం. టీ20​లో బౌలింగ్​ కోచ్​లు ఉంటారు. వాళ్లు ప్రతి బ్యాట్స్​మన్​ వీడియోలను ప్లే చేస్తారు. వారిని ఎలా ఔట్​ చేయాలో చెప్తుంటారు. అతడి బలాలు, బలహీనతలు చర్చిస్తారు. అయితే ధోనీ ఆ సమావేశాలకు హాజరుకాడు. మహీ తన సొంత ఆలోచనలనే నమ్ముకునే వ్యక్తి. ప్రధాన కోచ్​, బౌలింగ్​ కోచ్​ సహా అందరూ అక్కడే ఉంటారు. వారి అభిప్రాయాలు విని ధోనీ అక్కడ నుంచి లేచి వెళ్లిపోతాడు. మైదానంలో ఆటగాడు/బ్యాట్స్​మన్​ను ఎలా ఎదుర్కోవాలో ధోనీ అప్పటికప్పుడే ప్రణాళిక రచిస్తాడు. ఎవరికైనా ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుకోడానికి డేటా చాలా అవసరం. అయితే స్వయంగా అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే వారి స్వభావం, డేటా మధ్య హద్దులు సృష్టించడం చాలా కష్టం" అని శ్రీనివాసన్​ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.