ETV Bharat / sports

ధోనీ గుడ్​బై: అవును.. అతను వేరు అంతే!

భారత క్రికెట్​లో మరో అద్భుత కెప్టెన్ శకం ముగిసింది. సారథిగా ఎన్నో మరపురాని విజయాలు జట్టుకు అందించిన ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. తనదైన ముద్రవేస్తూ భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా నిలిచాడు. ఈ క్రమంలోనే అతని క్రికెట్​ ప్రయాణంతో పాటు.. వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక కథనం మీకోసం.

DHONI special story about his career
ధోనీ
author img

By

Published : Aug 16, 2020, 6:54 AM IST

అతను..

సునీల్‌ గావస్కర్‌లా రోజులకు రోజులు నిలబడే 'మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌' కాదు!

కపిల్‌ దేవ్‌లా భారత పేస్‌ బౌలింగ్‌ రాతను మార్చిన 'సూపర్‌ ఫాస్ట్‌బౌలర్‌' కాదు!

సచిన్‌ తెందుల్కర్‌లా బ్యాటింగ్‌కు పర్యాయం పదంలా మారిన 'క్రికెట్‌ దేవుడు' కాదు!

సౌరభ్‌ గంగూలీలా సై అంటే సై అంటూ ఢీకొట్టే 'దూకుడైన కెప్టెన్‌' కాదు!

రాహుల్‌ ద్రవిడ్‌లా క్రీజు చుట్టూ గోడ కట్టే 'బ్యాటింగ్‌ వాల్‌' కాదు!

అతను అతనే.. మహేంద్రసింగ్‌ ధోని!

ఒకరితో పోల్చలేం.. మరొకరితో పూడ్చలేం..!

అతడి పేరు.. మహేంద్ర సింగ్‌ ధోని!

అతను వేరు.. అంతే!

ఫోర్త్‌ అంపైర్‌

భారత క్రికెట్‌ దిగ్గజం గావస్కర్‌ కెరీర్లో ఎన్నో అద్భుత ప్రదర్శనలున్నాయి. గొప్ప విజయాలున్నాయి. ఆయన తొలిసారి వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడు కూడా. మరి సన్నీ తాను చివరి శ్వాస తీసుకునే ముందు చూడాలనుకున్నదేంటో తెలుసా? 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోని సిక్సర్‌ బాది భారత్‌కు మరో ప్రపంచకప్‌ అందించిన ఉద్వేగభరిత దృశ్యం! ఆ రోజు ధోని బ్యాటింగ్‌ చేసింది అయిదో స్థానంలో. కానీ ఆ స్థానం అతడిది కాదు. కానీ జట్టు విపత్కర పరిస్థితుల్లో ఉండగా.. ఫామ్‌లో ఉన్న యువరాజ్‌ను ఆపి అతను ముందుకొచ్చాడు. ఆ నిర్ణయం తిరగబడితే తానో చరిత్ర హీనుడవుతానని తెలిసీ ముందడుగు వేశాడు. అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడాడు. చరిత్రాత్మక విజయాన్నందించాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా అతను ఆ రోజు చేసిన సాహసం నభూతో నభవిష్యత్‌! అందుకే అతను వేరు.. అంతే!

DHONI special story about his career
ధోనీ

ధోని జీవితమేమీ పూల పాన్పు కాదు. అతడి క్రికెట్‌ ప్రయాణం అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. ఘనమైన క్రికెట్‌ వారసత్వం ఉన్న ముంబయి లాంటి మహా నగరం నుంచి రాలేదతను. పెద్దగా క్రికెట్‌ సంస్కృతి లేని 'రాంచి' అనే చిన్న నగరం అతడి స్వస్థలం. మధ్యతరగతి కుటుంబం. ఫ్యామిలీ కోసం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఇంకొకరైతే ఈ స్థితిలో క్రికెట్‌ ప్రయాణాన్ని ఆపేసేవాళ్లే. కానీ అతను ఆగిపోలేదు. టీమ్‌ఇండియాకు ఆడాలన్న కలను నెరవేర్చుకున్నాడు. అందిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకున్నాడు. ఒకసారి టీమ్‌ఇండియాకు ఆడితే చాలు అనుకున్నవాడు కాస్తా.. ఇప్పుడు భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మెన్‌, అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిష్క్రమిస్తున్నాడు. అందుకే అతను వేరు!

DHONI special story about his career
ధోనీ

కెప్టెన్​గా తొలి అడుగులోనే అద్భుతాలు

బ్యాట్స్‌మన్‌గా జట్టులో స్థానం సుస్థిరమై ఉండొచ్చు. 2007 వన్డే ప్రపంచకప్‌లో ఘోర పరాభవంతో టీమ్‌ఇండియాలో సంక్షోభం నెలకొన్న దశ అది. అప్పటికి మహి అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చి మూడేళ్లు కూడా కాలేదు. జట్టులో తనకంటే సీనియర్లు, మేటి ఆటగాళ్లు ఉన్నారు. ఆ స్థితిలో జట్టు పగ్గాలప్పగించి పొట్టి ప్రపంచకప్‌కు వెళ్లమంటే.. దిగ్గజాలకే భారంగా మారిన నాయకత్వం నాకెందుకని ధోని పక్కకు తప్పుకోలేదు. ధైర్యంగా ముందుకు నడిచాడు. తొలి అడుగులోనే కెప్టెన్‌గా అద్భుతాలు చేశాడు. జట్టును ప్రపంచకప్‌ విజేతగా నిలబెట్టాడు. దిగ్గజాల్ని గౌరవించాడు. సమకాలీనుల సహకారం తీసుకున్నాడు. జూనియర్లకు మార్గనిర్దేశం చేశాడు. అందరితో సమన్వయం చేసుకుని, సమష్టిగా జట్టును నడిపించి.. వన్డేల్లో అత్యున్నతమైన ప్రపంచకప్‌ను సాధించి పెట్టాడు. టెస్టుల్లోనూ జట్టును అత్యున్నత స్థానంలో నిలబెట్టాడు. అందుకే అతను వేరు!

టాప్​ ఆర్డర్​లో ఆడే సత్తా ఉన్నా..

"సచిన్‌ ఔటైతే టీవీలు కట్టేసేవాళ్లం".. అని 90ల నాటి రోజుల గురించి క్రికెట్‌ అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అప్పటి మిడిలార్డర్‌ అంత బలహీనం మరి! మంచి స్థితి నుంచి ఒక్కసారిగా కుప్పకూలడం, స్వల్ప లక్ష్యాల్ని ఛేదించలేక చేతులెత్తేయడం.. లాంటి అనుభవాలు కోకొల్లలు! గంగూలీ కెప్టెన్‌ అయ్యాక పరిస్థితి మెరుగుపడ్డప్పటికీ.. ధోని వచ్చాక మార్పు వేరు! టాప్‌ఆర్డర్‌లో ఆడే సత్తా, అవకాశం ఉన్నా.. తనను తాను కిందికి దించుకుని మిడిలార్డర్‌కు తిరుగులేని బలం తీసుకొచ్చి, మ్యాచ్‌లు ముగించడంలో తిరుగులేని నైపుణ్యంతో ప్రపంచంలోనే అత్యుత్తమ 'ఫినిషర్‌'గా పేరు తెచ్చుకున్న ఆటగాడు ధోని. మ్యాచ్‌ పూర్తిగా చేజారినట్లే కనిపించినా.. "ధోని ఉన్నాడు. చివరిదాకా చూద్దాం" అని టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ఘనత మహీదే. అందుకే అతను వేరు!

DHONI special story about his career
ధోనీ

వికెట్​కీపర్​గా ధోనీ లేకపోవడం వల్లే

కుల్‌దీప్‌ యాదవ్‌ మూడేళ్ల కిందట టీమ్‌ఇండియాలోకి వచ్చినప్పటి నుంచి రెండేళ్ల పాటు నిలకడగా రాణించిన స్పిన్నర్‌. అయితే ఏడాదిగా అతడి ప్రదర్శన బాగా లేదు. జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ఉన్నట్లుండి కుల్‌దీప్‌ ప్రదర్శన పడిపోవడానికి కారణంగా విశ్లేషకులు తేల్చిన విషయమేంటో తెలుసా.. అతను బౌలింగ్‌ చేస్తుంటే వికెట్ల వెనుక ధోని లేకపోవడం! బ్యాట్స్‌మెన్‌ కదలికల్ని పరిశీలిస్తూ, ఫీల్డింగ్‌ మార్పులు చేస్తూ, వ్యూహాత్మక సలహాలిస్తూ, లయ తప్పితే తిడుతూ.. బౌలర్లను మహి నడిపించే తీరే వేరు. గతేడాది ప్రపంచకప్‌ తర్వాత ధోని భారత్‌కు ఆడకపోవడం వల్ల తాను ఇబ్బంది పడుతున్నట్లు కుల్‌దీప్​ స్వయంగా అంగీకరించాడు. యువ ఆటగాళ్లపై ధోని ప్రభావం ఎలాంటిదో చెప్పడానికిది ఉదాహరణ. అందుకే అతను వేరు!

ధోనీ ఉన్నాడన్న ఒక్క ధైర్యంతో..

ధోని ఆకర్షణ కేవలం అతడి ఆటలో లేదు. అంతకుమించి, తన 'ఉనికి'లో ఉంది. బ్యాటింగ్‌లో తేలిపోయినా.. కెప్టెన్సీలో విఫలమైనా.. వికెట్‌ కీపింగ్‌లో తడబడినా.. అవతలి క్రీజులో ధోని ఉన్నాడన్న ధైర్యంతో ఓ యువ బ్యాట్స్‌మన్‌ ధైర్యంగా ఆడిన ఓ షాట్‌తో.. ధోని సలహా తీసుకుని ఓ బౌలర్‌ వేసిన ఓ వ్యూహాత్మక బంతితో.. మ్యాచ్‌లు మలుపు తిరిగిన సందర్భాలు ఎన్నో! ధోనీ జట్టుకు చేకూర్చే విలువ అది. జట్టులో ధోని ‘ఉనికి’ చూపించే ప్రభావం అది. అతనుంటే జట్టుకే కాదు.. అభిమానులకూ ఓ భరోసా! అందుకే అతను వేరు!

DHONI special story about his career
ధోనీ

ఆటగాడిగానే కాదు.. వ్యక్తిగానూ ధోని చూపిన, చూపించబోయే ప్రభావం ప్రత్యేకమైంది. అతి సామాన్య నేపథ్యం నుంచి వచ్చినా.. పట్టుదలతో శ్రమిస్తే అత్యున్నత శిఖరాలకు చేరొచ్చనడానికి అతనో ఉదాహరణ. ఏ స్థితిలోనైనా ప్రశాంతత చెదరని.. ఎంత ఎదిగినా ఎగిరి పడని.. పొగడ్తలకు పొంగిపోని.. విమర్శలకు వెరవని అతడి వ్యక్తిత్వం విలక్షణం! ధోని బ్యాటింగ్‌లో సొగసుండదన్నది కొందరు చేసే విమర్శ. కానీ అతడి పరుగులు జట్టుకు చేకూర్చిన ప్రయోజనం అమూల్యం! మేటి జట్టు చేతిలో ఉండటం వల్లే ధోని అద్భుతాలు చేయగలిగాడన్నది కొందరు చేసే దెప్పిపొడుపు. అదే ‘మేటి’ జట్టు సంక్షోభ సమయాల్ని ఎదుర్కొన్నపుడు కాడి వదిలేయకుండా సంయమనం పాటించి, సంధి దశను దాటించి.. అంతా ‘సురక్షితం’ అనుకున్నపుడు పగ్గాలు విడిచిపెట్టిన యోగి ధోని. అందుకే అతను వేరు!

నిష్క్రమించాలని ఆ రోజే నిర్ణయించుకున్నాడా?

"చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి ఉంటే.. ఒత్తిడుండేది ధోని మీద కాదు, బౌలర్‌ మీద".. ఒకప్పుడు వెస్టిండీస్‌ దిగ్గజం మైకేల్‌ హోల్డింగ్‌ చేసిన వ్యాఖ్య ఇది. ధోని ప్రత్యేకతను చాటిచెప్పే మాట ఇది. కానీ గత రెండు మూడేళ్లలో మహి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడం పోయి తనే ఒత్తిడిలో పడ్డ కొన్ని సందర్భాలు చూశాం. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో అది మరింత స్పష్టంగా కనిపించింది. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో ఔటై వెనుదిరిగాక మహి కళ్లలోని సన్నని కన్నీటి ధారే చెప్పేసింది.. అతడి కథ ముగిసిందని! జట్టుకు తన అవసరం ఉందనే ఆ టోర్నీ వరకు ఆడిన మహి.. ఆ రోజే నిర్ణయంచుకున్నట్లున్నాడు ఇక నిష్క్రమించాలని! కానీ ఇంకో ఏడాది ఉత్కంఠకు గురి చేసి.. ఎంతో చర్చకు తావిచ్చి. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన రిటైర్మెంట్‌ కబురు చల్లగా చెప్పాడు.

మరి ధోని నిష్క్రమించాడని అంతర్జాతీయ క్రికెట్‌ ఆగిపోతుందా? అభిమానులు ఆగిపోతారా? ఏవీ ఆగవు! కానీ భారత క్రికెట్‌ ఇంతకు ముందులా మాత్రం ఉండదు! ‘‘ఈ సమయంలో ధోనీ ఉండుంటేనా’’ అని ఏదో ఒక సందర్భంలో అనుకోని అభిమాని ఉండడు! అలా అనుకున్న ప్రతిసారీ అర్థమవుతుంది.. భారత క్రికెట్‌పై ‘ధోని’ ఓ చెరిగిపోని సంతకమని!

DHONI special story about his career
ధోనీ

మే పల్‌ దో పల్‌కా షాయర్‌

"నేను కవిని. అది క్షణ కాలానికో.. రెండు క్షణాలకో. నా కథ ఒకటో రెండో క్షణాల్లో ముగుస్తుంది. నా ఉనికీ అంతే. నా యవ్వనమూ క్షణమో రెండు క్షణాలో ఉంటుంది. నా కన్నా ముందు ఎంతో మంది కవులు వచ్చారు.. వెళ్లారు. రేపు ఇంకొందరు వస్తారు. వాళ్లు నాకన్నా బాగా రాస్తారు".

రిటైర్మెంట్‌ ప్రకటిస్తూ ధోని గుర్తు చేసుకున్న పాట (మే పల్‌ దో పల్‌కా షాయర్‌)లో కొంత భాగమిది. ప్రతి ఒక్కరి కథా ఏదో ఒక రోజు ముగియాల్సిందే, కొత్త కథ ప్రారంభం కావాల్సిందే అన్న భావంతో ధోని ఈ పాటను పోస్ట్‌ చేసి ఉండొచ్ఛు.

వివాదరహితుడు..

ధోని నిర్ణయాలు తీసుకోవడంలో దృఢంగా వ్యవహరిస్తాడు. కానీ ఎప్పుడూ సహనం కోల్పోడు. మైదానంలోనే కాదు.. మైదానం బయట కూడా. తాను ఎంత పెద్ద సెలెబ్రిటీ అతడు ఏనాడూ అహంకారాన్ని ప్రదర్శించలేదు. తన స్థాయితో ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నించలేదు. ఎల్లప్పుడూ అనకువగా ఉన్నాడు. దాంతో పాటు ఎప్పుడూ ఓర్పుతో ఉండడం, ఆవేశపడకపోవడం వల్ల ధోని తన కెరీర్‌లో చివరి రోజు వరకూ వివాదరహితుడిగా ఉన్నాడు. ధోనీనే తన కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడంటూ యువరాజ్‌ తండ్రి అనేకసార్లు నోరుపారేసుకున్నా ధోని స్పందించలేదు.

గంభీర్‌ కూడా ఎన్నోసార్లు తనన రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించినా అతడు విస్మరించాడు. స్వయంగా యువరాజ్‌ కూడా తనకు ధోని మద్దతివ్వలేదని, అతడికి ఫేవరెట్‌ క్రికెటర్లున్నారని అన్నా మహి మౌనాన్నే ఆశ్రయించాడు. సీనియర్లతో తనకు విభేదాలున్నాయని జోరుగా ఊహాగానాలు సాగినా ధోని ఆవేశపడలేదు. అతడే స్పందిస్తే వివాదాలు చెలరేగేవే.

హెలికాప్టర్‌ షాట్‌

ధోని అనగానే గుర్తొచ్చేది హెలికాప్టర్‌ షాట్‌! యార్కర్‌గా పడిన బంతిని భుజ బలంతో ఈడ్చి కొట్టినట్లు ఆడే ఈ షాట్‌ ధోనీకే సొంతం. కెరీర్‌ ఆరంభంలో ఈ షాట్‌తో అతను కొట్టే సిక్సర్లు సంచలనం రేపాయి. ఎంతోమంది ఈ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

పేలాడు డైనమైట్‌లా!

ధోని తన కెరీర్‌ ఆరంభంలోనే డైనమైట్‌లా పేలాడు! అప్పటిదాకా వికెట్‌కీపర్‌ అంటే బ్యాటింగ్‌ ఆర్డర్లో దిగువన వచ్చి ఎన్నో కొన్ని పరుగులు సాధిస్తే చాలు అన్నట్లు ఉండేవాళ్లు. కానీ ధోని కథ మార్చేశాడు. 2005లో విశాఖలో పాక్‌తో వన్డేలో 123 బంతుల్లో 148 పరుగుల ఇన్నింగ్స్‌తో మొదలైంది అతని ధనాధన్‌ ప్రస్థానం. ఆ తర్వాత శ్రీలంకపై అతనాడిన 183 పరుగుల ఇన్నింగ్స్‌ సరికొత్త మహిని అభిమానులకు పరిచయం చేసింది. ధోనీది ఆరంభం నుంచి చివరిదాకా ఒకే జోరు. బాదుడే బాదుడు. అందుకే మహి అభిమానులకు తెగ నచ్చేశాడు. ఆటగాడిగానే కాదు కెప్టెన్‌గానూ ఆరంభంలోనే ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ దూకుడు ప్రదర్శించాడు. 2007 వన్డే ప్రపంచకప్‌ ఓటమితో ఢీలా పడిన భారత క్రికెట్‌కు టీ20 ప్రపంచకప్‌ అందించి వెలుగును నింపాడు. అక్కడి నుంచి ఎదురే లేదతడికి.

అతనంతే...!

తనదైన నాయకత్వంతో భారత క్రికెట్‌ దశా దిశా మార్చాడు సౌరభ్‌ గంగూలీ. అయితే గంగూలీకి దూకుడే బలం కాగా.. దానికి భిన్నమైన తీరుతో భారత కెప్టెన్‌గా తనదైన ముద్ర వేశాడు మహి. భారత క్రికెట్‌ ఇంకా ఉన్నత శిఖరాలకు చేర్చాడు. మధ్యలో జట్టు ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. మళ్లీ దాన్ని గాడిన పెట్టి కోహ్లి చేతికి అందించాడు.

2014లో విరాట్‌ తాత్కాలిక కెప్టెన్‌గా ఓ మ్యాచ్‌లో సత్తా చాటుకోగానే.. సిరీస్‌ మధ్యలో ఉన్నట్లుండి టెస్టులకు వీడ్కోలు చెప్పేశాడు ధోని. ఆపై విరాట్‌ వన్డే కెప్టెన్‌గా సిద్ధం అనుకోగానే పగ్గాలు వదిలేశాడు. జట్టు అవసరం రీత్యా ఆటగాడిగా కొనసాగిన అతను.. ఇప్పుడు ఎవరూ తన రిటైర్మెంట్‌ గురించి చర్చించని సమయంలో కూల్‌గా.. ఏ హడావుడీ లేకుండా వన్డేలు, టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు. వచ్చే నెలలో మొదలు కానున్న ఐపీఎల్‌లో ఆడి సత్తా నిరూపించుకుంటే మళ్లీ మహి భారత జట్టులోకి వస్తాడని అభిమానులు అనుకుంటుండగా.. ఇలా హఠాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించేశాడు.

రికార్డులే రికార్డులు

వన్డేల్లో 200 సిక్స్‌లు కొట్టిన ఏకైక భారత ఆటగాడు ధోని. మొత్తంగా అతనిది అయిదో స్థానం.

వన్డేల్లో ఒక వికెట్‌కీపర్‌ అత్యధిక స్కోరు (183 నాటౌట్‌, శ్రీలంకపై 2005లో) మహి పేరిటే ఉంది.

50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక స్టంపింగ్‌ల (120) రికార్డు కూడా మహిదే.

ఒక భారత కెప్టెన్‌ సాధించిన అత్యధిక టెస్టు విజయాల (27) రికార్డు ధోనీదే.

టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు (54), కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు (72), సారథిగా అత్యధిక విజయాలు (41) మహి ఖాతాలోనే ఉన్నాయి.

రనౌట్‌తో మొదలెట్టి.. ముగించి

ధోని కెరీర్‌ ఆరంభించింది రనౌట్‌తోనే.. కెరీర్‌ను ముగించింది కూడా రనౌట్‌తోనే కావడం యాదృచ్ఛికం! 2004లో బంగ్లాదేశ్‌పై ఆడిన తొలి వన్డేలో అతను మొదటి బంతికే రనౌట్‌ అయ్యాడు. కెరీర్‌లో తన చివరి మ్యాచ్‌ అయిన 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లోనూ రనౌట్‌గానే అతను వెనుదిరిగాడు.

ఎవరి స్పందనేంటి..?

ఎన్నో ఉత్కంఠభరిత పోరాటాలను జట్టుకు అనుకూలంగా మలిచాడు. భిన్న ఫార్మాట్లలో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. హెలికాప్టర్‌ షాట్లను ప్రపంచ క్రికెట్‌ కోల్పోనుంది మహీ.

- హోం మంత్రి అమిత్‌ షా

భారత క్రికెట్‌కు నువ్వు అందించిన సహకారం అపారమైంది. మనం కలిసి 2011 ప్రపంచకప్‌ గెలవడం నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభిస్తున్న నీకు, నీ కుటుంబానికి అభినందనలు.

- సచిన్‌ తెందుల్కర్‌

ఏ క్రికెటరైనా ఏదో ఓ రోజు తన ప్రయాణాన్ని ముగించాలి. కానీ మనకు బాగా తెలిసిన వ్యక్తి అలా చేస్తే భావోద్వేగాలను దాచుకోవడం కష్టం. దేశానికి నువ్వు చేసిన సేవ ప్రతి ఒక్కరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.

- కోహ్లి

ఒక శకానికి ముగింపు ఇది. దేశం, ప్రపంచ క్రికెట్‌ చూసిన అద్భుతమైన ఆటగాడు ధోని. అతని నాయకత్వ లక్షణాలను అందుకోవడం కష్టం.

- సౌరభ్‌ గంగూలీ

ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన కుర్రాడు.. మ్యాచ్‌ విజేతగా మారడంతో పాటు ప్రపంచం మెచ్చే సారథిగా ఎదిగిన ధోని ప్రయాణాన్ని నేను చూశా.

- లక్ష్మణ్‌

వన్డేల్లో భారత కెప్టెన్లలో చూసుకుంటే ధోని, కపిల్‌దేవ్‌ అగ్రస్థానంలో ఉంటారు. ఎందుకంటే వాళ్లు ప్రపంచకప్‌లు గెలిచారు. మొత్తంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ను తీసుకుంటే కపిల్‌ కంటే ధోని ముందుంటాడు.

- గావస్కర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.