ETV Bharat / sports

పార్క్​లో పెంపుడు కుక్కతో ధోనీ.. వీడియో వైరల్ - Dhoni, Jeeva Plays with Pet Dog

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ భార్య సాక్షి సింగ్ తాజాగా ఓ వీడియోను నెట్టింట పంచుకుంది. ఇందులో ధోనీ తన పెంపుడు కుక్క సామ్​తో ఆడుకుంటూ కనిపించాడు.

ధోనీ
ధోనీ
author img

By

Published : May 12, 2020, 12:51 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ లాక్​డౌన్ సమయంలో కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. ఇటీవలే తన కొత్త రఫ్​ లుక్​లో దర్శనమిచ్చిన ఇతడు తాజాగా మరో వీడియోలో తమ పెంపుడు కుక్క సామ్​తో ఆడుకుంటూ కనిపించాడు. ఈ వీడియోను మహీ భార్య సాక్షి ఇన్​స్టా స్టోరీలో పంచుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో ధోనీ తన ముద్దుల కుమార్తె జీవాతో, తన పెంపుడు కుక్కతో ఆహ్లాదంగా ఆటపాటలతో సమయం గడుపుతూ కనిపించాడు. సాధారణ టీషర్ట్‌, లూజ్‌ ప్యాంట్‌లో నెరిసిన సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ స్టైల్‌ గడ్డంతో కనిపించాడు. ధోనీని ఇలా చూసి క్వారంటైన్‌ లుక్‌ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.