టీమిండియా మాజీ సారథి ధోనీ రిటైర్మెంటుపై అతడి మిత్రుడు, వ్యాపార భాగస్వామి, మేనేజర్ అరుణ్‌పాండే కీలక విషయం వెల్లడించాడు. మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం క్రికెట్‌ను వీడే ఆలోచనలో లేడని చెప్పుకొచ్చాడు.
" ఇంత కంగారుగా ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఉద్దేశంలో లేడు. అతడి రిటైర్మెంటుపై వస్తోన్న వార్తలు అవాస్తవం".
-- అరుణ్ పాండే, ధోనీ సన్నిహితుడు
ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమిపాలయ్యాక... ధోనీ రిటైర్మెంట్ అంశం గురించి చర్చ మొదలై ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా అరుణ్ సమాధానంతో పరోక్షంగా అన్నింటికి చెక్ పెట్టినట్లయింది.
జులై 21న వెస్టిండీస్ టూర్‌కు భారత జట్టు ఎంపిక జరగనుంది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లలో ధోనీకి చోటు కల్పిస్తారా.? లేదా.? అన్నది ఆసక్తిగా మారింది. సెలక్షన్‌కు రెండు రోజుల ముందు అరుణ్ పాండే మాటలు కీలకంగా మారాయి. అయితే బీసీసీఐ అధికారులు మాత్రం ఈ విషయంపై ధోనీనే ప్రశ్నించాలంటూ తప్పించుకొంటున్నారు.
ఇవీ చూడండి...సన్‌రైజర్స్‌కు ప్రపంచకప్ విన్నింగ్ కోచ్