ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 వన్డేల సిరీస్లో మహేంద్రసింగ్ ధోనీ చివరి రెండు మ్యాచ్లకు దూరం కానున్నాడు. త్వరలో ప్రపంచకప్ జరగనున్న తరుణంలో మహీకి విశ్రాంతినిచ్చింది జట్టు యాజమాన్యం. ధోనీ స్థానంలో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాలి గాయంతో మహ్మద్ షమీ కూడా అందుబాటులో ఉండట్లేదు.
"చివరి రెండు వన్డేల్లో కొన్ని మార్పులు చేయబోతున్నాం. ధోనీకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం."
--సంజయ్ బంగర్, భారత జట్టు సహాయక కోచ్
ప్రపంచకప్ అనంతరం మహీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత గడ్డపై ధోనికి రాంచీ వన్డేనే చివరి మ్యాచ్ కానుంది. అంతేకాదు స్వదేశంలో టీమిండియాకు అక్టోబరు వరకు మ్యాచ్లు లేవు.
వచ్చే సీజన్లో మహీ ఆడతాడని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ నమ్మంకగా ఉంది. స్వదేశంలో జరిగే మ్యాచ్ల్లో ధోనీకి ఘనమైన వీడ్కోలు పలుకుతామని విశ్వసిస్తుంది.