2013 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు ఈ జట్టుపై నిషేధం విధించారు. 2018లో పునరాగమనం చేసినా... తన కెరీర్లో అదొక మచ్చగా అభిప్రాయపడ్డాడు ధోని. ఎవరో చేసిన తప్పుకు జట్టుపై శిక్ష వేయడం తీవ్రంగా కలచివేసిందని భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ సమయంలో నోట మాట రాక తడబడుతుంటే రైనా నీళ్లు అందించాడు. సారథితో పాటు సహచర ఆటగాళ్లు ఉద్వేగానికి లోనయ్యారు.
The Moment @msdhoni Got emotional !!
— Whistlepodu/GGMU (@Whistleepodu) March 29, 2018 " class="align-text-top noRightClick twitterSection" data="
Shows ho much @ChennaiIPL means to him 😍😍#Dhoni #CSK #whistlepodu #WhistlePoduArmy pic.twitter.com/CrftU4GnND
">The Moment @msdhoni Got emotional !!
— Whistlepodu/GGMU (@Whistleepodu) March 29, 2018
Shows ho much @ChennaiIPL means to him 😍😍#Dhoni #CSK #whistlepodu #WhistlePoduArmy pic.twitter.com/CrftU4GnNDThe Moment @msdhoni Got emotional !!
— Whistlepodu/GGMU (@Whistleepodu) March 29, 2018
Shows ho much @ChennaiIPL means to him 😍😍#Dhoni #CSK #whistlepodu #WhistlePoduArmy pic.twitter.com/CrftU4GnND
- మళ్లీ వచ్చామని వాళ్లకు చెప్పండి...
కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల ఉదంతాన్ని తెరకెక్కించారు. 'తిరుంబి వందుతేను సొల్లు' (తిరిగొచ్చామని వాళ్లకు చెప్పండి) అనే ట్యాగ్‌లైన్ దీనికి పెట్టారు.
- ఇంత కఠిన శిక్షా..!
ఫిక్సింగ్‌కు కారకుడైన గురునాథ్ ఫ్రాంఛైజీ యజమాని కాదని, శ్రీనివాసన్‌కు అల్లుడు మాత్రమేనని ధోనీ వివరించాడు. ఎవరో చేసిన తప్పుకు జట్టుపై కఠిన శిక్ష వేయడం బాధాకరమని వ్యాఖ్యానించాడు. ఫిక్సింగ్ కేసులోకి తననూ లాగాలని చూశారని ధోని ఆరోపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తన అనుబంధం వివాహమంత ధృడమైందని అభిప్రాయపడ్డాడు.
- ఆ ఎంపికకు రుణ పడి ఉంటా:
ఏ జట్టులోకి రావాలనీ తాను కోరుకోలేదని చెన్నై ఫ్రాంఛైజీయే ఏరి కోరి ఎంచుకుందని ధోనీ చెప్పాడు. నాయకత్వ బాధ్యతలను అప్పగించిన క్షణం నుంచే ఆ జట్టుతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందన్నాడు.
- అభిమానులే మాకు అండ:
2018లో పునరాగమనం చేసిన సీఎస్‌కేను అందరూ 'డాడీస్ ఆర్మీ' అని వెక్కిరించారని... దీనికి కారణం వేలంలో పాల్గొన్న ఆటగాళ్ల సగటు వయసు 33-34 ఏళ్ల మధ్య ఉండటమేనని ధోని గుర్తుచేశాడు. 2018లో మూడోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకోవడానికి ప్రధాన కారణం అభిమానులేనని కితాబిచ్చాడు.
Whistle parakkum paaru! #ThalaParaak #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/6EeMkYT0QY
— Chennai Super Kings (@ChennaiIPL) March 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Whistle parakkum paaru! #ThalaParaak #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/6EeMkYT0QY
— Chennai Super Kings (@ChennaiIPL) March 17, 2019Whistle parakkum paaru! #ThalaParaak #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/6EeMkYT0QY
— Chennai Super Kings (@ChennaiIPL) March 17, 2019
‘రోర్ ఆఫ్ ద లయన్' డాక్యుమెంటరీలో ధోనీతో పాటు చెన్నై ఆటగాళ్లు సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, మోహిత్ శర్మ, కోచ్‌లు మాథ్యూ హెడెన్, మైకేల్ హస్సీ కనిపించారు.