ETV Bharat / sports

తెలంగాణ, ఏపీలో ధోనీ క్రికెట్ అకాడమీ - ఆంధ్రప్రదేశ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహ కర్ణాటక రాష్ట్రాల్లో ఎంఎస్ ధోనీ క్రికెట్​ అకాడమీలను నెలకొల్పనున్నారు. ఈ మేరకు ఆర్కా స్పోర్ట్స్​ , బ్రెయినియాక్స్​ బీ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.

dhoni academby in telangana and ap
తెలంగాణ, ఏపీలో ధోనీ క్రికెట్ అకాడమీ
author img

By

Published : Feb 12, 2021, 9:54 PM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో త్వరలోనే మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్​ అకాడమీలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్​మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, బ్రెయినియాక్స్​ బీ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. బెంగళూరు మినహా ఈ మూడు రాష్ట్రాల్లోని విద్యార్థులకు అత్యున్నత నాణ్యమైన క్రికెట్​ శిక్షణ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఈ అకాడమీలను ఏర్పాటు చేయనున్నారు.

ఒప్పంద సమావేశం

ఆర్కాకు ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 అకాడమీలు ఉన్నాయి. విదేశాల్లో మరో మూడు ఉన్నాయి. 500లకు పైగా కోచ్​లు.. 10వేల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నట్లు ఆర్కా స్పోర్ట్స్​ ఎండీ మిహిర్ దివాకర్ తెలిపారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ ఎంఎస్​ ధోనీ మార్గనిర్దేశం, పర్యవేక్షణలో విద్యార్థులకు ప్రపంచస్థాయి కోచింగ్​ అందించడం ఆనందంగా ఉందని బ్రెయినియాక్స్​ బీ డైరెక్టర్​ వినోద్ కుమార్ అన్నారు.

ఇదీ చూడండి: 'ధోనీని చూస్తుంటే సుశాంత్​ గుర్తొస్తున్నాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.