ETV Bharat / sports

ధోనికి మద్దతు పలికిన కేంద్రమంత్రి

ధోని బలిదాన్​ గుర్తు కలిగిన గ్లౌజులను ఉపయోగించడంపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆ గుర్తును అలానే ఉంచాలని ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా దీనిపై కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​ స్పందించారు. ధోని నిజమైన దేశభక్తుడని కొనియాడారు.

author img

By

Published : Jun 8, 2019, 10:21 AM IST

ధోనికి మద్దతు పలికిన కేంద్రమంత్రి

కేంద్రమంత్రి గిరిరాజ్​ సింగ్​ భారత క్రికెటర్​ ధోనిపై ప్రశంసల జల్లులు కురిపించారు. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోని బలిదాన్​ గుర్తు కలిగిన గ్లౌజులు ధరించడాన్ని సమర్థించారు. మహీ నిజమైన దేశభక్తుడని కితాబిచ్చారు.

"ధోని క్రికెటర్​ మాత్రమే కాదు. అతడు నిజమైన దేశభక్తుడు. మిగతా సెలబ్రిటీల్లా దేశంపై ప్రేమను వ్యక్తపరచకుండా ఉండడు. దేశ ఔన్నత్యాన్ని కాపాడేందుకు నడుంకట్టిన వ్యక్తి ".
--గిరిరాజ్​ సింగ్​, కేంద్రమంత్రి

ప్యారాచూట్‌ సైనిక దళ విభాగంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోని.. తాను భాగమైన దళం అధికారిక చిహ్నం ‘బలిదాన్‌’ను గ్లౌజుల మీద ముద్రించుకుని ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడటంతో ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

క్రికెటర్లు ఉపయోగించే దుస్తులు, పరికరాలపై స్పాన్సర్ల లోగోలు మినహాయిస్తే.. రాజకీయ, మత, వాణిజ్య ప్రయోజనాలతో ముడిపడ్డ చిహ్నాలు ఉండకూడదన్నది ఐసీసీ నిబంధన. ఫలితంగా ధోని గ్లౌజులపై ఉన్న సైనిక చిహ్నాన్ని తొలగించాలని బీసీసీఐని కోరింది ఐసీసీ.

ఐసీసీ ఆదేశంపై స్పందించిన బీసీసీఐ... ధోని ఆ చిహ్నాన్ని గ్లౌజుల మీద పెట్టుకోవడంలో ఎలాంటి రాజకీయ, వాణిజ్య ప్రయోజనాలు లేవని వివరణ ఇచ్చింది. దేశభక్తిని చాటడానికే ధోని అలా చేశాడు కాబట్టి ఆ చిహ్నం ఉన్న గ్లౌజులను కొనసాగనివ్వాలని ఐసీసీని కోరింది. కానీ బోర్డు విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. మరి ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్​కు ధోని ఎలాంటి గ్లౌజులతో బరిలోకి దిగుతాడో చూడాల్సిందే.

Special Advisory
Friday 7th June 2019
GOLF: A hole in one from Thongchai Jaidee at the GolfSixes in Portugal. Already moved.
Regards,
SNTV London
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.