ETV Bharat / sports

ఐపీఎల్​లో ఆడాలని ఉంది.. కానీ...: రూట్

ఐపీఎల్​లో ఆడాలని ఎంతో కోరికగా ఉన్నట్లు చెప్పాడు ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది ఆడలేకపోయినా.. వచ్చే ఏడాది ఆ లీగ్​లో ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

author img

By

Published : Feb 12, 2021, 4:20 PM IST

Desperate to be a part of IPL season: Joe Root
ఐపీఎల్​లో ఆడాలని ఉంది.. కానీ తప్పదు: జో రూట్

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో ఆడాలని ఎంతో ఆత్రుతగా ఉన్నట్లు చెప్పాడు ఇంగ్లాండ్​ సారథి జో రూట్. అయితే అతడు ఈ ఏడాది ఐపీఎల్​ వేలానికి దరఖాస్తు చేసుకోలేదు. అందుకు గల కారణాన్ని వివరించాడు ఈ స్టార్ బ్యాట్స్​మన్.

"నా కెరీర్​లో ఒక దశలో ఐపీఎల్​లో ఆడాలని బలంగా కోరుకున్నా. అందులో భాగస్వామినై, దానిని అనుభూతి చెందాలని అనుకున్నా. అయితే అంతర్జాతీయ క్రికెట్​లో మరీ ముఖ్యంగా టెస్టుల్లో ఆడాల్సి ఉన్నందున ఈ ఏడాది ఐపీఎల్​ వేలానికి నమోదు చేసుకోలేదు. అది చాలా కఠినమైన నిర్ణయం. వచ్చే ఏడాది ఐపీఎల్​లో ఆడే ఆవకాశం దక్కుతుందని భావిస్తున్నా." అని రూట్ అన్నాడు.

రెండో టెస్టు నుంచి మైదానాల్లో ప్రేక్షకులు రావడం పట్ల హర్షం వ్యక్తంచేశాడు రూట్. అభిమానులు, క్రికెటర్ల మధ్య సంభాషణ ఎంతో ప్రత్యేకమన్నాడు. భారతీయులు క్రికెట్​ పట్ల ఎంతో ఆదరణ చూపిస్తారని, అది వారి జీవితంలో భాగమని చెప్పాడు.

ఇక భారత్​తో జరిగే మూడో టెస్టుకు పేస్ ద్వయం జోఫ్రా ఆర్చర్, జేమ్స్​ అండర్సన్​ అందుబాటులో ఉంటారని రూట్ స్పష్టం చేశాడు. మోచేతి గాయం కారణంగా ఫిబ్రవరి 13న ప్రారంభమయ్యే రెండో టెస్టుకు ఆర్చర్​ అందుబాటులో ఉండటంలేదు. నాలుగు మ్యాచ్​ల సిరీస్​లో చివరి రెండు టెస్టుల్లో ఉత్తేజకరంగా బరిలోకి దిగేందుకు రెండో టెస్టుకు అండర్సన్​కు విశ్రాంతినిచ్చారు.

ఇదీ చూడండి: నాలుగు మార్పులతో రెండో టెస్టుకు ఇంగ్లాండ్ రె'ఢీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.