రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ సునాయస విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో 23బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఓటమితో రాజస్థాన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది దిల్లీ. ఓపెనర్లు ధావన్ (16), పృథ్వీషా (8) విఫలమయ్యారు. సారథి శ్రేయస్ అయ్యర్ (15)తో పాటు ఇన్‌గ్రామ్ (12) కూడా తక్కువ పరుగులకే పరిమితమయ్యాడు. రిషభ్ పంత్ చక్కటి ఇన్నింగ్స్‌తో అలరించాడు. 38 బంతుల్లో అర్ధశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
రాజస్థాన్ బౌలర్లలో ఇష్ సోధి మూడు వికెట్లు తీయగా.. శ్రేయస్ గోపాల్ రెండు వికెట్లు తీశారు.
స్వల్ప స్కోరు చేసిన రాయల్స్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రహానే సేన.. దిల్లీ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులు చేసింది. ప్రారంభంలో 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్థాన్. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రియన్ పరాగ్, శ్రేయస్ గోపాల్ కాస్త జాగ్రత్తగా ఆడారు. శ్రేయస్ గోపాల్ (12), స్టువర్ట్ బిన్నీ(0)లను అమిత్ మిశ్రా వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. రియాన్ పరాగ్ ఒక్కడే అర్ధశతకంతో రాణించాడు.
రియాన్ అద్భుత అర్ధశతకం
ఓ వైపు వికెట్లు పడుతున్నా యువ ఆటగాడు రియాన్ పరాగ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్లో అతి తక్కువ వయసులో అర్ధశతకం సాధంచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
దిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. బౌల్డ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.