ఆడిన పది మ్యాచ్‌ల్లో ఆరింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది దిల్లీ క్యాపిటల్స్. మూడింటిలో మినహా మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడి దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది రాజస్థాన్. ఈ రెండింటి మధ్య జైపుర్ వేదికగా నేడు మ్యాచ్ జరగుతోంది. మొదటగా టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.
-
Shreyas Iyer calls it right at the toss and elects to bowl first against the @rajasthanroyals.#RRvDC pic.twitter.com/lSHSfxU2gb
— IndianPremierLeague (@IPL) April 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Shreyas Iyer calls it right at the toss and elects to bowl first against the @rajasthanroyals.#RRvDC pic.twitter.com/lSHSfxU2gb
— IndianPremierLeague (@IPL) April 22, 2019Shreyas Iyer calls it right at the toss and elects to bowl first against the @rajasthanroyals.#RRvDC pic.twitter.com/lSHSfxU2gb
— IndianPremierLeague (@IPL) April 22, 2019
గత మ్యాచ్‌లో రహానే నుంచి స్మిత్ సారథ్యం బాధ్యతలు తీసుకున్నాడు. జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబయిపై జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకంతో అటు బ్యాటింగ్‌లోనూ మెప్పించాడు. మరోవైపు సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన దిల్లీ.. పంజాబ్‌ను ఓడించి జోరుమీదుంది.
జట్లు
రాజస్థాన్ రాయల్స్
సంజూ శాంసన్(కీపర్), రహానే, స్మిత్(కెప్టెన్), స్టోక్స్, టర్నర్, స్టువర్ట్ బిన్ని, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్, ధవల్ కులకర్ణి
దిల్లీ క్యాపిటల్స్
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్(కీపర్), కొలిన్ ఇన్‌గ్రామ్, అక్షర్ పటేల్, రూథర్ ఫర్డ్, రబాడ, అమిత్ మిశ్రా, క్రిస్ మోరిస్, ఇషాంత్ శర్మ