ETV Bharat / sports

దిల్లీ క్యాపిటల్స్​ జెర్సీలపై 'థ్యాంక్యూ కొవిడ్​ వారియర్స్​'

కరోనాపై పోరాడుతున్న యోధులకు ధన్యవాదాలు చెప్పే విధంగా తమ ఆటగాళ్ల జెర్సీలపై ఓ సందేశాన్ని రాస్తున్నట్లు దిల్లీ క్యాపిటల్స్​ ప్రకటించింది. టోర్నీ మొత్తం జెర్సీలపై 'థ్యాంక్యూ కొవిడ్​ వారియర్స్​' అని ప్రదర్శించనున్నట్లు స్పష్టం చేసింది.

author img

By

Published : Sep 18, 2020, 1:56 PM IST

Delhi Capitals to thank COVID warriors throughout IPL campaign
దిల్లీ క్యాపిటల్స్​ జర్సీలపై 'థ్యాంక్యూ కొవిడ్​ వారియర్స్​'

ప్రస్తుత ఐపీఎల్​లో కొవిడ్​ వారియర్స్​కు ధన్యవాదాలు తెలిపే విధంగా తమ జట్టు ఆటగాళ్లు జెర్సీలను ధరించనున్నట్లు దిల్లీ క్యాపిటల్స్​ వెల్లడించింది. ఆటగాళ్ల జెర్సీలపై 'థ్యాంక్యూ కొవిడ్​ వారియర్స్​' అనే సందేశాన్ని ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది.

కరోనా పోరాటయోధులైన డాక్టర్లు, పోలీసు ఆఫీసర్లతో దిల్లీ క్యాపిటల్స్ జట్టు సీనియర్​ పేసర్​ ఇషాంత్ శర్మ, స్పిన్నర్​ అమిత్​ మిశ్రా, అసిస్టెంట్​ కోచ్​ మహమ్మద్​ కైఫ్​లు వర్చువల్​గా ముచ్చటించారు. 'సలాం దిల్లీ' కార్యక్రమంలో భాగంగా వారి కోసం పత్యేక జెర్సీలను పంపించారు.

"పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, భద్రతా దళాలు, రక్త దాతలు, సామాజిక కార్యకర్తలు, డ్రైవర్ల కుటుంబాలకు మా బృందం నుంచి ఇది చిన్న కానుక. మీరు చేసే సేవలకు నిదర్శనంగా నిలుస్తుంది" అని ఇషాంత్​ శర్మ అన్నాడు.

"కరోనాపై పోరాటం చేస్తున్న యోధుల సేవలు ఎలా కొనియాడాలో తెలియడం లేదు. మీకో పెద్ద సలాం. కరోనాపై చేసే పోరాటంలో మీ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి" అని అమిత్​ మిశ్రా అన్నాడు. ప్రజల మనుగడ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు మహమ్మద్​ కైఫ్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.