ETV Bharat / sports

వచ్చే ఏడాది నుంచి భారత దేశవాళీ క్రికెట్

దేశవాళీ క్రికెట్ వచ్చే ఏడాది తొలిరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వెల్లడించాడు.

Delayed Indian domestic cricket season to start only in 2021
వచ్చే ఏడాది నుంచి భారత దేశవాళీ క్రికెట్
author img

By

Published : Oct 18, 2020, 6:24 AM IST

కరోనా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఇక దేశవాళీ క్రికెట్‌ లేనట్టే! వచ్చే జనవరి 1 నుంచి దేశవాళీ సీజన్‌ ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ శనివారం ప్రకటించాడు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ganguly
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ

"దేశవాళీ క్రికెట్‌పై సమగ్రంగా చర్చించిన తర్వాత వచ్చే జనవరి 1 నుంచి ఆ సీజన్‌ను ప్రారంభించాలని చూచాయగా నిర్ణయం తీసుకున్నాం. వైరస్‌ పరిస్థితుల కారణంగా అన్ని టోర్నీలు నిర్వహించే అవకాశం లేకపోవచ్చు. రంజీ ట్రోఫీని పూర్తిస్థాయిలో జరిపేందుకు ప్రయత్నిస్తాం" అని గంగూలీ తెలిపాడు.

వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టు.. క్వారంటైన్‌ సమయంలో ప్రాక్టీస్‌ చేసుకునే వీలుందని దాదా తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.