కరోనా నుంచి కోలుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చాహర్.. జట్టులో చేరడానికి బీసీసీఐ అనుమతిచ్చింది. ఫలితంగా అతడు శుక్రవారం నుంచి సాధన ప్రారంభించాడు. దీంతో సీఎస్కేకు ఊరట లభించినట్లైంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.
ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్న సీఎస్కేలో చాహర్, రుతురాజ్ గైక్వాడ్ సహా మరో 11మందికి కరోనా సోకింది. దీంతో అందరూ క్వారంటైన్లో ఉన్నారు. అనంతరం రెండు సార్లు చేసిన కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షల్లో చాహల్‌కు నెగిటివ్‌గా తేలింది. దీంతో అతడు బయోబబుల్‌లోకి అడుగుపెట్టాడు. కానీ బీసీసీఐ నిబంధనల ప్రకారం నెగిటివ్ వస్తే కార్డియో వాస్కులర్ పరీక్ష చేయించుకోవాలి. తాజాగా సదరు పరీక్ష చేయించుకున్న చాహర్‌కు సానుకూల ఫలితం రావడం వల్ల.. అతడు జట్టులో చేరడానికి భారత క్రికెట్ బోర్డు అనుమతిచ్చింది.
కరోనా సోకిన మరో ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు శనివారం రెండో రౌండ్ వైరస్ పరీక్షలు చేయించనున్నారు. ఇందులో నెగిటివ్ తేలితేనే బుడగలోకి అడుగుపెడతాడు గైక్వాడ్.
ఇదీ చూడండి ఐపీఎల్2020: ఆర్సీబీ బలాలు, బలహీనతలు ఇవే!