డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ.. ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ అభిమానులకు చాలా దగ్గర అయిపోయాడు. అయితే అతడి రెండో కుమార్తె ఇండీ మాత్రం టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీకి వీరాభిమాని.
ట్రిపుల్ ఎమ్ సిడ్నీ 104.9 ఎఫ్ఎమ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ భార్య క్యాండీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. సదరు ఎఫ్ఎమ్ తన వీడియోను ట్వీట్ చేయగా, సారీ వార్నర్ అంటూ ఈమె రీట్వీట్ చేసింది.
-
Sorry @davidwarner31. 🤣❤️ https://t.co/dDqPF51vJu
— Candice Warner (@CandiceWarner31) November 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sorry @davidwarner31. 🤣❤️ https://t.co/dDqPF51vJu
— Candice Warner (@CandiceWarner31) November 18, 2020Sorry @davidwarner31. 🤣❤️ https://t.co/dDqPF51vJu
— Candice Warner (@CandiceWarner31) November 18, 2020
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీలోని క్వారంటైన్లో ఉన్నారు టీమ్ఇండియా ఆటగాళ్లు. వీరితో పాటు ఐపీఎల్ పాల్గొన్న వార్నర్, స్మిత్, కమిన్స్ తదితరులు కూడా అక్కడే ఉన్నారు.
నవంబరు 27న భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్నారు.