లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్న ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్.. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నాడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న ఇతడు.. గత నెలలోనే టిక్‌టాక్ ఖాతాను ప్రారంభించాడు. ఇటీవలే కుమార్తె ఇండీతో 'షీలా కీ జవానీ' పాటకు డ్యాన్స్ చేసి అలరించాడు. ఇప్పుడు కుటుంబంతో కలిసి, జట్టు జెర్సీ ధరించి కాలు కదిపాడు. ఆ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారథ్యం వహిస్తున్న వార్నర్.. లీగ్ నిరవధిక వాయిదా పడటం వల్ల ఇంటికే పరిమితమయ్యాడు. మార్చి 29నే ప్రారంభమవాల్సిన ఈ సీజన్‌ను, ఏప్రిల్ 15కు తొలుత వాయిదా వేశారు. అప్పటికీ వైరస్ ప్రభావం తగ్గకపోవటం వల్ల లీగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది.