ETV Bharat / sports

జడేజాను కాపీ కొట్టిన వార్నర్.. ఎందుకోసమో! - david warner news

మైదానంలో తిరిగి అడుగుపెట్టి బ్యాట్​తో విధ్వంసం సృష్టించాలనుకుంటున్నాడు ఆసీస్​ బ్యాట్స్​మెన్​ డేవిడ్​ వార్నర్. ఐపీఎల్​లో ఆడటానికి తను ఎంతగానో ఎదురుచూస్తున్నానని తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.

David Warner Swings Bat Like A Sword
వార్నర్​ బ్యాట్​ను కత్తిలా తిప్పుతున్న వీడియో వైరల్​
author img

By

Published : Apr 9, 2020, 5:48 AM IST

ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్ వార్నర్ తన అభిమానులను సోషల్ మీడియాలో అలరిస్తుంటాడు. తన ఇన్​స్టాగ్రామ్​లో తాజాగా ఓ వీడియోను షేర్​ చేశాడు. ఐపీఎల్​లో​ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న వార్నర్​ ఓ వాణిజ్య ప్రకటనకు గానూ బ్యాట్​ను కత్తిలాగా తిప్పుతూ అందులో కనిపించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు జడేజాను గుర్తుచేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

డేవిడ్​ వార్నర్​ ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి మంచి ఫామ్​లో కొనసాగుతున్నాడు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్​లో భారత్​పై 128 పరుగులు చేసి అలరించాడు. స్వదేశంలో ఆసీస్​పై జరిగిన ఆ మూడు మ్యాచ్​ల సిరీస్​ను 2-1 తేడాతో భారత్​ కైవసం చేసుకుంది. ఇతర క్రికెటర్ల మాదిరిగానే వార్నర్ క్రికెట్ మైదానంలోకి తిరిగి రావడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్​లోనూ వార్నర్​.. సన్​రైజర్స్​ హైదరబాద్​ జట్టులోనే ఉంటాడని ఇటీవలే యాజమాన్యం ప్రకటించింది.

కరోనా వ్యాప్తి కారణంగా ఐపీఎల్​ 2020.. ఏప్రిల్ 15కు వాయిదా పడింది. అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఇప్పట్లో టోర్నీ మొదలయ్యే సూచనలేవి కనిపించటంలేదు.

ఇదీ చూడండి.. విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్​గా ​స్టోక్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.