ETV Bharat / sports

మహేశ్​కు డేవిడ్ వార్నర్ 'మైండ్​బ్లాక్' విషెస్ - డేవిడ్ వార్నర్ మైండ్ బ్లాక్ సాంగ్

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నేడు పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతడికి శుభాకాంక్షలు తెలిపాడు.

మహేశ్​కు డేవిడ్ వార్నర్ 'మైండ్​బ్లాక్' విషెస్

author img

By

Published : Aug 9, 2020, 4:53 PM IST

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ ‌బాబు నేడు పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఆయన జన్మదినం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అటు అభిమానులే కాకుండా ఇటు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఆస్ట్రేలియా క్రికెటర్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ కూడా మహేశ్‌కు తనదైన శైలిలో విషెస్ చెప్పాడు.

లాక్‌డౌన్‌ వేళ ఇంటికే పరిమితమైన వార్నర్‌ టాలీవుడ్‌ అగ్రహీరోల పాటలకు, సినిమా డైలాగులకు టిక్‌టాక్‌ వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. మహేశ్‌ బాబు 'మైండ్​బ్లాక్'​ సాంగ్​కు కూడా చిందులేశాడు.

ఈ నేపథ్యంలోనే ఆదివారం అతని పుట్టినరోజు సందర్భంగా మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు వార్నర్. 'మైండ్‌బ్లాక్' పాటకు అతడు డ్యాన్స్ చేసిన వీడియోను మరోసారి నెట్టింట షేర్ చేశాడు. 'హ్యాపీబర్త్‌డే లెజెండ్‌' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

వార్నర్‌ గతేడాది ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 12 మ్యాచ్‌ల్లో 692 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం కూడా ఉంది. అతడంతలా రెచ్చిపోయినా సన్‌రైజర్స్‌ తుదిపోరుకు చేరుకోలేకపోయింది. తర్వలోనే ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ ప్రారంభమవుతుండం వల్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.