ETV Bharat / sports

వార్నర్​కు ఇష్టమైన క్రి కెట్ ఫార్మాట్ అదే! - క్రికెట్​ ఫార్మాట్​ వార్నర్​ టిక్​ టాక్​

వరుస టిక్​టాక్​ వీడియోలతో అలరిస్తోన్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్​ వార్నర్​ తాజాగా మరో వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​ చేశాడు. ఇందులో తనకు ఏ క్రికెట్​ ఫార్మాట్​ అంటే ఇష్టమో తెలిపాడు.

warner
వార్నర్​
author img

By

Published : May 27, 2020, 6:57 PM IST

లాక్‌డౌన్‌ సమయంలో తనను మించిన ఎంటర్‌టైనర్‌ లేడు ఇకపై రాడు అనేలా విజృంభిస్తున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌. టిక్‌టాక్‌ వీడియోలతో అభిమానులను అలరిస్తూ నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాడు. ఈ కొద్ది కాలం వ్యవధిలోనే లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న ఈ విధ్వంసకర ఓపెనర్‌ తాజాగా మరో వీడియోను పోస్ట్​ చేశాడు. క్రికెట్‌లో తనకు ఏ ఫార్మాట్ అంటే ఇష్టమో.. ఈ టిక్​టాక్ వీడియో ద్వారా తెలిపాడు.

ఈ వీడియోలో వార్నర్​ ఓ అద్దం ముందు సాధారణ దుస్తులతో నిలబడి ఉంటాడు. అకస్మాత్తుగా గారడి చేసినట్లుగా అద్దంలో తన దుస్తులు ఆస్ట్రేలియా టీ20 జెర్సీలోకి మారిపోతాయి. అనంతరం వన్డే జెర్సీ, ఆ తర్వాత టెస్ట్​ క్రికెట్​ జెర్సీలోకి మారిపోతుంది. టెస్ట్​ క్రికెట్​ జెర్సీలోకి మారిపోగానే ఎంతో ఉత్సాహంతో ఎగిరి గంతేశాడు వార్నర్​. "టెస్ట్​ క్రికెట్​ ఫార్మాట్​ను నేను అమితంగా ఇష్టపడతాను. ఏమంటారు మీరు?" అంటూ వ్యాఖ్య జోడించాడు.

ఇటీవల రోహిత్​ శర్మతో ఇన్​స్టా లైవ్​ సెషన్​లో పాల్గొన్న వార్నర్​.. ఐపీఎల్​ 13వ సీజన్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టుకు సారథ్యం వహించాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఐపీఎల్​ను నిరవధిక వాయిదా వేసంది బీసీసీఐ.

ఇదీ చూడండి : లాక్​డౌన్​ క్రికెటర్లు: ఆన్​లైన్​లో​ఆట.. లైక్​ల వేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.