ETV Bharat / sports

కుటుంబంతో కారులో షికారుకెళ్లిన వార్నర్​! - వార్నర్​ కారు రేసు టిక్​టాక్​

ఇటీవల కొన్ని తెలుగు పాటలు, డైలాగ్​లతో అమితంగా ఆకట్టుకున్న ఆస్ట్రేలియన్​ బ్యాట్స్​మన్ డేవిడ్​ వార్నర్​ మరోసారి తన టిక్​టాక్​ వీడియోను షేర్​ చేశాడు. కారు రేసులో ఎవరు గెలుస్తున్నారో చూడండంటూ పోస్ట్​ చేశాడు.

David Warner Participates In Unique "Car Race" With Family In Latest TikTok Video
కుటుంబంతో కారు రేసులో పాల్గొన్న వార్నర్​.. గెలిచిందెవరు?
author img

By

Published : May 13, 2020, 6:48 PM IST

లాక్​డౌన్​లో టిక్​టాక్​ వీడియోలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ డేవిడ్​ వార్నర్​. టిక్​టాక్​ అధికంగా వాడుతున్న క్రికెటర్లలో వార్నర్​ మొదటిస్థానంలో ఉన్నాడు. 'కారు రేసులో ఎవరు గెలుస్తారు' అంటూ తాజాగా మరో వీడియోను షేర్​ చేశాడీ స్టార్​ క్రికెటర్. అందులో తన భార్యతో పాటు పిల్లలూ పాల్గొన్నారు.

టిక్​టాక్​ వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో ప్రభంజనం సృష్టిస్తున్నాడీ కంగారు​ బ్యాట్స్​మన్. ముఖ్యంగా తెలుగు పాటలకు అతడి ఫ్యామిలీ కాలు కదపడం ఫ్యాన్స్​ను విశేషంగా అలరిస్తోంది. ఇప్పటికే 'బుట్టబొమ్మ' సాంగ్​తో పాటు పోకిరిలోని ఓ డైలాగ్​కు నటించిన వార్నర్ తాజాగా 'రాములో రాములా' పాటకూ చిందేశాడు.

ఇదీ చూడండి.. ఈసారి 'రాములో రాములా'.. వార్నర్ తగ్గట్లేదుగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.