ETV Bharat / sports

'ఖాళీ మైదానాల్లో ఐపీఎల్ ఆడేందుకు నేను సిద్ధం' - ఖాళీ మైదానాల్లో ఐపీఎల్ ఆడేందుకు ఆసీస్ బౌలర్ కమిన్స్ సిద్ధం

ఐపీఎల్​ గురించి మాట్లాడిన ఆసీస్ బౌలర్ కమిన్స్... మైదానాల్లో అభిమానులు లేకపోయినా,​ ఆడేందుకు తాను సిద్ధమని చెప్పాడు. ఇతడు కోల్​కతా నైట్​రైడర్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Cummins willing to play IPL behind closed doors
'ఖాళీ మైదానాల్లో ఐపీఎల్ ఆడేందుకు నేను సిద్ధం'
author img

By

Published : Apr 10, 2020, 3:30 PM IST

ఐపీఎల్​ వేలంలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా పేసర్​ ప్యాట్​ కమిన్స్.. వీక్షకులు లేకపోయినా ఐపీఎల్​ ఆడేందుకు సిద్ధమని చెప్పాడు. ఇతడిని రూ.15.50 కోట్లకు సొంతం చేసుకుంది కోల్​కతా నైట్​రైడర్స్.

"ఎప్పుడైనా ఆట‌కంటే ఆరోగ్య‌మే ముఖ్యం. ఐపీఎల్ లాంటి పెద్ద టోర్న‌ీలు జ‌రగ‌క‌పోతే చాలా బాధ‌గా ఉంటుంది. అయితే ప్రస్తుత ప‌రిస్థితుల్లో మార్పు వస్తే, ఖాళీ మైదానాల్లో మ్యాచ్‌లు ఆడేందుకైనా సిద్ధ‌మే. అభిమానులు ఎలాగో టీవీల్లో మ్యాచ్‌లు చూడ‌గ‌లుగుతారు" ​

-ప్యాట్​ కమిన్స్​, ఆస్ట్రేలియా పేసర్​

కరోనా ప్రభావంతో గత నెల 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్..​ ఈనెల​ 15కు వాయిదా పడింది. వైరస్​ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా టోర్నీ జరిగే విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై బీసీసీఐ ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 16లక్షల మందికి కరోనా సోకగా, 95వేల మందికి పైగా మరణించారు. భారత్​లో 6 వేలమందికి పైగా వైరస్​తో బాధపడుతుండగా, 199 మంది చనిపోయారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.