ETV Bharat / sports

సీఎస్కేకు దెబ్బ మీద దెబ్బ.. మరో ఆటగాడికి కరోనా!

చెన్నై సూపర్ కింగ్స్​కు చెందిన మరో ఆటగాడికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. సీఎస్కే యువ బ్యాట్స్​మన్ రుతురాజ్ గైక్వాడ్​కు వైరస్ నిర్ధరణ అయినట్లు సమాచారం.

సీఎస్కేకు దెబ్బ మీద దెబ్బ.. మరో ఆటగాడికి కరోనా!
సీఎస్కేకు దెబ్బ మీద దెబ్బ.. మరో ఆటగాడికి కరోనా!
author img

By

Published : Aug 29, 2020, 2:13 PM IST

చెన్నై సూపర్‌కింగ్స్‌కు‌ వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మరో ఆటగాడికి కరోనా వైరస్‌ సోకిందని సమాచారం. శుక్రవారం చేసిన ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో అతడికి పాజిటివ్‌గా ధ్రువీకరణ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఫ్రాంచైజీలో కొవిడ్‌-19 బాధితుల సంఖ్య మొత్తంగా 13కు చేరింది. ఒకే బృందంలో అంతమందికి వైరస్‌ సోకిందంటే పరిస్థితి కష్టమేనని అనిపిస్తోంది.

ప్రస్తుతం వైరస్‌ సోకిన ఆటగాడు ఈ మధ్యే భారత్‌-ఏకు ఎంపికయ్యాడని, టాపార్డర్​లో ఆడతాడని, రంజీల్లో పరుగుల వరద పారించాడని సమాచారం. దాంతో మహారాష్ట్ర యువ క్రికెటర్‌ రుత్‌రాజ్‌‌ గైక్వాడ్ పైనే అనుమానాలు నెలకొన్నాయి. 2018-19 సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో రుతురాజ్‌ సత్తాచాటాడు. మహారాష్ట్ర తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. అందుకే 2019 వేలంలో అతడిని చెన్నై కొనుగోలు చేసింది.

రుతురాజ్
రుతురాజ్

ఇప్పటికే సురేశ్‌ రైనా పూర్తిగా టోర్నీకి దూరమయ్యాడు. జట్టులో చాలామంది కొవిడ్‌ రావడం, కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం వల్లే అతడు తిరిగి భారత్‌కు పయనమవుతున్నాడని అంటున్నారు. 13 మందికి వైరస్‌ సోకడంతో విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా? ఆడేందుకు మొగ్గు చూపుతారా? అన్నది అనుమానంగా మారింది.

ఎందుకంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. వైరస్‌ ఇంక్యుబేషన్‌కు కాలం ఎక్కువే కాబట్టి ఇంకెంత మందికి పాజిటివ్‌ వస్తుందోనని అందరూ భయపడుతున్నారు. బహుశా క్రికెటర్ల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.